Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చివరి మ్యాచ్ ఆడకుండానే ఐపిఎల్ కు ధోనీ గుడ్ బై

చివరి మ్యాచ్ ఆడకుండానే ఐపిఎల్ కు ధోనీ గుడ్ బై

Oktelugu.com 5 days ago

MS Dhoni IPL Retirement: ఎల్లో జెర్సీ, ధోని.. ఈ రెండింటిని వేరుగా చూడలేం. ఎందుకంటే చెన్నై జట్టు ఐదుసార్లు ఐపీఎల్ విజేతగా నిలవడంలో ధోనిది సింహం లాంటి పాత్ర.

ఒత్తిడి.. ఓటములు.. విమర్శలు.. ప్రతికూలతలు.. ప్రతి బంధకాలు.. ఇలా ఎన్ని ఉన్నా సరే ధోని వాటన్నిటిని అధిగమించాడు. తనతో పాటు మిగతా ప్లేయర్లు కూడా అధిగమించేలా చేశాడు. అందుకే చెన్నై జట్టును ఐదుసార్లు ఛాంపియన్ గా నిలపగలిగాడు.

ఎల్లో జెండాను అనేక సందర్భాలలో రెపరెపలాడించిన ధోనిని ఎల్లో ఆర్మీ తలా అని పిలుచుకుంటూ ఉంటుంది. చివరికి మహేంద్ర సింగ్ ధోని కాస్త తలా ధోని అయిపోయాడు. అందువల్లే ధోని లేని ఎల్లో ఆర్మీని చూడడం కష్టమైపోయింది. అందువల్లే చెన్నై మేనేజ్మెంట్ ధోనిని పక్కన పెట్టడం లేదు. అతడి కోసం ఎన్నో చేస్తోంది. జట్టు కోసం కూడా ఎన్నో చేయాలని ధోనికి ఉంది. కాకపోతే ఆరోగ్యం సహకరించడం లేదు.

ఈ సీజన్లో ధోని ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. చిదంబర స్టేడియంలో చెన్నై జట్టు ఈ సీజన్లో చివరి మ్యాచ్ ఆడేసింది. ఈ మ్యాచ్లో చెన్నై జట్టు తరఫున ధోని రంగంలోకి దిగుతాడని అందరు అనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. పైగా ధోని సతీమణి సాక్షి, కుమార్తె జీవా ఎల్లో అవుట్ ఫిట్ ఆకట్టుకున్నారు. దీంతో హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ ధోనికి చివరిదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. చివరి మ్యాచ్ ఆడకుండానే ధోని ఐపిఎల్ కు వీడ్కోలు పలికాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత చెన్నై ఆటగాళ్లు మైదానంలో సందడి చేశారు. అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. చెన్నై జట్టు ఆటగాళ్లలో ధోని కూడా ఉన్నాడు. జట్టు ప్లేయర్లతో కలిసి ధోని ఫోటో కూడా దిగాడు. ఆ తర్వాత గ్రౌండ్ స్టాప్ తో ఫోటోలు దిగాడు. అభిమానులు అడిగితే సెల్ఫీలకు ఫోజులు కూడా ఇచ్చాడు. ఇవన్నీ జరిగాయి కాబట్టి ధోని వచ్చే ఐపిఎల్ సీజన్ లో కనిపించడని చర్చ నడుస్తోంది. మరోవైపు ధోని రిటర్మెంట్ ప్రకటించినప్పటికీ.. ఏదో ఒక రూపంలో చెన్నై జట్టుతో అతడు కొనసాగుతూనే ఉంటాడని క్రికెట్ అభిమానులు అంటున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com