Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చుక్కలు చూపిస్తున్నారు.. ఆడి గెలవాలి కానీ ఇలా చప్పుడు చేసి గెలుచుడు ఏందిరా బై

చుక్కలు చూపిస్తున్నారు.. ఆడి గెలవాలి కానీ ఇలా చప్పుడు చేసి గెలుచుడు ఏందిరా బై

Oktelugu.com 2 weeks ago

England Vs Mexico FIFA World Cup: ఏ ఆటైనా సరే.. ఆడాలి.. పోరాడాలి.. చివరి వరకు శాయశక్తులను ఒడ్డాలి. అప్పుడే గెలుపు సాధ్యమవుతుంది. కొన్ని సందర్భాలలో ఈ స్థాయిలో కష్టపడినప్పటికీ విజయం దక్కదు.

ప్రతి ఆటలో విజయం దక్కుతుందనే క్రీడాకారులు రంగంలోకి దిగుతారు. చివరి వరకు పోరాటాన్ని సాగిస్తూ ఉంటారు. కానీ ఈ కథనంలో తమ జట్టు ఆటగాళ్లు గెలవాలని అభిమానులు సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు..ఎవరూ అంచనా వేయలేని విధానానికి పాల్పడ్డారు. చివరికి వీరి వ్యవహారం మీడియాలో పడి ప్రపంచవ్యాప్తంగా రచ్చ రచ్చ అవుతోంది.

ఫిఫా వరల్డ్ కప్ లో క్వార్టర్స్ లో చోటు తగ్గించుకోవడానికి ఇంగ్లాండ్ తాపత్రయపడుతోంది. ఈ నేపథ్యంలో మెక్సికో జట్టుతో ఇంగ్లాండు కీలకమైన మ్యాచ్ ఆడబోతోంది. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ మెక్సికో అభిమానులు ఓ దుర్మార్గానికి పాల్పడ్డారు. ఎవరూ ఊహించని విధానానికి శ్రీకారం చుట్టారు. దీంతో వాళ్ళ వ్యవహారం రకరకాల చర్చకు దారితీస్తోంది.

ఇంగ్లాండ్ జట్టు బస చేసిన హోటల్ బయట మెక్సికో అభిమానులు మామూలు హంగామా చేయడం లేదు. డ్రమ్స్ వాయిస్తున్నారు. షార్ట్స్ పేలుస్తున్నారు. ఇంగ్లాండ్ ప్లేయర్లకు నిద్రలేకుండా చేస్తున్నారు. పోలీసులు హెచ్చరించినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇటీవల కాలంలో ఈక్వెడార్ జట్టుతో కూడా ఇలానే వ్యవహరించారు. గెలుపు కోసం అనేక రకాల అడ్డదారులు తొక్కారు. మెక్సికో అభిమానులు వ్యవహరిస్తున్న తీరు పట్ల అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మ్యాచ్లో గెలవాలని ఇంగ్లాండ్ జట్టుకు యాజమాన్యం ఆ మాత్రలు పంపిణీ చేసింది. రాత్రిపూట ఆ కార్యం పూర్తి చేసుకోవాలని సూచించింది. ఈ కార్యం వల్ల ప్లేయర్ల మీద ఉన్న ఒత్తిడి తగ్గుతుందని.. వారు మైదానంలో స్వేచ్ఛగా ఆడగలుగుతారని మేనేజ్మెంట్ భావించింది. ఇంగ్లాండ్ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.. ఇంగ్లాండ్ జట్టు గురించి మేనేజ్మెంట్ అలా ఆలోచిస్తే.. మెక్సికో గురించి అభిమానులు ఇలా విధ్వంసం ఆలోచన చేశారు. మొత్తానికి తమ జట్టు మాత్రమే గెలవాలని ఇంగ్లాండ్ ప్లేయర్లు బస చేసిన హోటల్ ఎదురుగా రచ్చ రచ్చ చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com