Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దేశీయ రక్షణశక్తికి చిరునామాగా రాయలసీమ.. మోదీతో చంద్రబాబు చేస్తున్న యజ్ఞమిదీ

దేశీయ రక్షణశక్తికి చిరునామాగా రాయలసీమ.. మోదీతో చంద్రబాబు చేస్తున్న యజ్ఞమిదీ

Oktelugu.com 1 week ago

Rayalaseema Defence Hub: రాయలసీమ.. ఈ పేరు చెప్పగానే ఒక రకమైన అనుభూతి.. రతనాల సీమగా ఖ్యాతి. అయితే వాతావరణ దుర్భిక్ష పరిస్థితులు.. వర్షాభావ పరిస్థితులతో సరైన పంటలు పండడం లేదు.

రాయలసీమ ప్రజల ఆకలి తీరడం లేదు. ఇటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం రాయలసీమ పై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. కేంద్ర ప్రభుత్వంతో కలిపి సంయుక్తంగా ఎన్నో పరిశ్రమలను ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా ఈరోజు రక్షణ రంగానికి సంబంధించి.. ఐదోతరం ఫైటర్ జెట్ ల తయారీ కేంద్రాన్ని పుట్టపర్తిలో ప్రారంభిస్తోంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కలిసి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టనున్నారు. రాయలసీమ చరిత్రలోనే ఇదో మైలురాయి. దేశంలోనే తొలిసారిగా దేశీయంగా అభివృద్ధి చేస్తున్న అత్యాధునిక ఐదోతరం అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తయారీ కేంద్రం ఇదే కావడం గమనార్హం. దేశంలో తొలి ఐదో తరం యుద్ధ విమానాల తయారీ ఇక్కడే కావడం విశేషం. ఈ భారీ ప్రాజెక్టు రాకతో ఏరోస్పేస్ హబ్ గా శ్రీ సత్య సాయి జిల్లా నిలవనుంది. అనుబంధ సంస్థల ఏర్పాటుతో భారీగా ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు చేస్తున్న యజ్ఞం ఇది. ఇకనుంచి రక్షణ శాఖ చిరునామాగా రాయలసీమ నిలవనుంది.

* ఐదోతరం యుద్ధ విమానాల తయారీ..
రక్షణ రంగంలోనే డిఆర్డివో, ఏడీఏలది కీలక పాత్ర. వాటి ఆధ్వర్యంలో 140 ఏఎంసీఏలను ఇక్కడ తయారు చేస్తారు. ఐదో తరం యుద్ధ విమానాల అసెంబ్లింగ్, అన్గ్రౌన్దింగ్ టెస్టింగ్ కూడా ఇక్కడే నిర్వహిస్తారు. ఈ ప్రాజెక్టు ప్రతిపాదన రాగానే ఏపీ ప్రభుత్వం పుట్టపర్తిలో 600 ఎకరాలు కేటాయిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 7500 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి. ఈ ప్రాజెక్టుకు అనుబంధంగా వచ్చే ఇతర యూనిట్ల ద్వారా లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చే వీలుంది. వీటి కోసం మరో నాలుగు వందల ఎకరాల భూములను ప్రభుత్వం సిద్ధం చేసింది. రక్షణ రంగంలో శ్రీ సత్య సాయి జిల్లా పేరు మార్మోగనుంది.

* శ్రీ సత్యసాయి జిల్లాలో..
రాయలసీమలో తయారీ రంగ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. ముఖ్యంగా శ్రీ సత్య సాయి జిల్లా ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే పాలసముద్రం వద్ద భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో వెయ్యి ఎకరాల్లో.. డిఫెన్స్ సిస్టం ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ ఏర్పాటవుతుంది. 500 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇది నిర్మితం అవుతోంది. క్షిపణి వ్యవస్థలు, రాడార్లు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థ, ఏరో స్పేస్ రంగానికి అవసరమైన ఉత్పత్తులను ఇక్కడ తయారు చేస్తారు.

* డ్రోన్స్ పరిశ్రమల సైతం..
కేవలం రక్షణ రంగ పరిశ్రమలు మాత్రమే కాదు.. వాటికి సంబంధించిన డ్రోన్ తయారీ సంస్థలు ఏర్పాటు కానున్నాయి రాయలసీమలో. మడకశిరలో కళ్యాణి స్ట్రాటజిక్ లిమిటెడ్ కమ్యూనికేషన్ అండ్ ఆగ్నేయాస్త్ర ఎనర్జిటిక్ సంస్థ దాదాపు 1000 ఎకరాల్లో.. 200400 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను స్థాపించనుంది. భారత డైనమిక్స్ లిమిటెడ్ మిస్సైల్స్ సిస్టమ్స్ రంగంలో మరో 500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. హెచ్ఎఫ్సీఎల్ సంస్థ మల్టీ మూడ్ హ్యాండ్ గ్రేనేడ్ తో పాటు ఇతర అనుబంధ ఉత్పత్తుల తయారీ కోసం… ఓ రక్షణ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. అలాగే ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లిమిట ప్రోపెలెంట్స్ వార్ హెడ్స్ తయారీ లో మరో 500 రూపాయల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అయితే ఏకంగా డ్రోన్స్ ప్రాజెక్టులు భారీగా తరలిరావడం చూస్తుంటే.. రాయలసీమ రూపురేఖలు మారిపోనున్నాయి అన్నమాట.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com