Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
డ్రైవర్లకు బిగ్ అలర్ట్.. ఫాస్టాగ్ జేబులో పెట్టుకుంటే మీరు బ్లాకులో పడ్డట్లే

డ్రైవర్లకు బిగ్ అలర్ట్.. ఫాస్టాగ్ జేబులో పెట్టుకుంటే మీరు బ్లాకులో పడ్డట్లే

Oktelugu.com 10 months ago

Big Alert for FASTag: ఫాస్టాగ్ కార్డును కారు విండ్ షీల్డ్‌కు అతికించకుండా జేబులోనో లేదా చేతిలోనో పట్టుకుని టోల్ గేట్ దగ్గర చూపిస్తున్నారా ? అయితే ఇక మీదట అలా కుదరదు.

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఇకపై ఫాస్టాగ్ కార్డ్‌ను కారు అద్దంపై సరిగ్గా అతికించకపోతే కూడా వాటిని బ్లాక్ లిస్ట్ చేస్తారు. అలాంటి వాళ్లు టోల్ గేట్ల దగ్గర ఫాస్టాగ్ ద్వారా టోల్ చెల్లించలేరు. ఈ కొత్త నిబంధనలు ఎందుకొచ్చాయో, దీని వల్ల మీకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయో వివరంగా ఈ వార్తలో తెలుసుకుందాం.

పెట్రోల్ బంకులో పనోడు.. అంత పెద్ద జర్నలిస్ట్ ఇలా అయ్యాడట!

సాధారణంగా ఫాస్టాగ్ స్టిక్కర్‌ను కారు లేదా ఏదైనా వెహికల్ విండ్‌షీల్డ్‌పై అంటించాలి. అప్పుడు టోల్ గేట్ దగ్గరకు రాగానే ఆటోమేటిక్‌గా స్కాన్ అయ్యి సదరు కార్డు హోల్డర్ అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అవుతాయి. అయితే, కొంతమంది కావాలనే ఈ స్టిక్కర్‌ను అంటించకుండా జేబులోనో లేదా చేతిలోనో పట్టుకొని టోల్ దగ్గర చూపిస్తుంటారు. ఇలాంటి వాటిని లూజ్ ఫాస్టాగ్ అని పిలుస్తారు. ఈ పద్ధతి వల్ల టోల్ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్ అవుతుంది. సిస్టమ్‌లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందుకే NHAI ఇలాంటి చర్యలు తీసుకుంది.

కొంతమంది ఫాస్టాగ్ నిబంధనలను మోసం చేయడానికి ఇలా చేస్తుంటారు. ఉదాహరణకు.. భారీ ట్రక్కులకు చిన్న కారు ఫాస్టాగ్ స్టిక్కర్‌ను ఉపయోగించి తక్కువ టోల్ చెల్లించడానికి ప్రయత్నిస్తుంటారు. వేర్వేరు వాహనాలకు ఒకే ఫాస్టాగ్‌ను ఉపయోగిస్తుంటారు. డబ్బులు కట్ అవ్వకుండా టోల్ దాటడానికి ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వానికి, టోల్ ప్లాజాలకు ఆర్థికంగా నష్టం వస్తుంది. అలాగే, ఆటోమేటిక్ టోలింగ్ సిస్టమ్ ముఖ్య ఉద్దేశ్యం దెబ్బతింటుంది.

శ్రీశైలం వెళ్లే వారందరికీ ఇది షాకింగ్ న్యూస్

లూజ్ ఫాస్టాగ్ ఉపయోగిస్తూ పట్టుబడితే మీ ఫాస్టాగ్‌ను NHAI వెంటనే బ్లాక్‌లిస్ట్ చేస్తుంది. బ్లాక్‌లిస్ట్ అయిన తర్వాత మీ ఫాస్టాగ్ టోల్ ప్లాజా వద్ద పనిచేయదు. ఫాస్టాగ్ గనుక పనిచేయకపోతే టోల్ గేట్ వద్ద చేతిలోంచి నగదు చెల్లించాల్సి వస్తుంది. బ్లాక్‌లిస్ట్ అయిన ఫాస్టాగ్ వల్ల టోల్ గేట్ వద్ద గందరగోళం ఏర్పడి, మీ టైం వేస్ట్ అవుతుంది. మీరు మళ్లీ కొత్త ఫాస్టాగ్ కొనుగోలు చేసి, దానిని యాక్టివేట్ చేసుకోవడానికి సమయం, డబ్బు రెండూ వెచ్చించాల్సి ఉంటుంది.

అందుకే ఈ సమస్యకు పరిష్కారం చాలా సులభం. మీ ఫాస్టాగ్‌ను కారు విండ్‌షీల్డ్‌కు సరిగ్గా అంటించాలి. ఇది టోల్ గేట్ వద్ద మీ ప్రయాణాన్ని సులభతరంగా మార్చడమే కాకుండా, సిస్టమ్ పనితీరు మెరుగుపరిచేందుకు కూడా సాయపడుతుంది. ప్రస్తుతం ఉన్న ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ టెక్నాలజీ ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు కాబట్టి, ఫాస్టాగ్‌ను సరిగ్గా అంటించాల్సిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com