Dailyhunt
ఈ ముగ్గురితో మమత చెంప చెల్లుమనేలా చేసింది బిజెపి..

ఈ ముగ్గురితో మమత చెంప చెల్లుమనేలా చేసింది బిజెపి..

Oktelugu.com 1 week ago

Bengal Election Results: ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తులు ప్రజల గురించి గొప్పగా ఆలోచించక పోయినా పర్వాలేదు గాని.. వారికోసం గొప్ప పనులు చేయకపోయినా పర్వాలేదు గాని..

వారిని ఇబ్బంది పెట్టకుంటే చాలు. ముఖ్యంగా వారి మానప్రాణాలతో ఆటలాడుకోకుండా ఉంటే చాలు. కానీ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ఇదే చేసింది.

బెంగాల్ రాష్ట్రం భారతదేశానికి ఒకప్పుడు కర్మాగారం మాదిరిగా ఉండేది.. బెంగాల్ రాష్ట్రం నుంచి వచ్చిన రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద.. ఇంకా ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఈ దేశ యవనిక మీద తమదైన ముద్ర వేశారు. అటువంటి బెంగాల్ రాష్ట్రాన్ని మమతా బెనర్జీ 15 సంవత్సరాల పరిపాలన కాలంలో పూర్తిగా భ్రష్టు పట్టించారు. తన పార్టీ కార్యకర్తలతో బెంగాల్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. మమత పార్టీ కార్యకర్తలు ఆడవాళ్ళ మీద చేసిన దారుణాలు మరొక ఎత్తు. ఆడవాళ్ళ మీద టీఎంసీ కార్యకర్తలు దారుణాల మీద దారుణాలు చేశారు. ఘోరాల మీద ఘోరాలకు పాల్పడ్డారు. యావత్ మీడియా మొత్తుకున్నప్పటికీ.. సమాజం ప్రశ్నించినప్పటికీ మమతలో కొంత కూడా చలనం కలగలేదు. పైగా ఆమె తన కార్యకర్తలు చేసిన పనిని సమర్థించుకున్నారు..

మమత కార్యకర్తల వల్ల ఇబ్బందులు పడిన కుటుంబాలకు భారతీయ జనతా పార్టీ టికెట్లు కేటాయించింది. ఈ ఎన్నికల్లో బాధిత కుటుంబాల నుంచి పోటీ చేసిన వారు విజయం సాధించారు. అయితే ఆ పోటీలో ఉన్నవారు మొత్తం మహిళలే కావడం విశేషం. మహిళల చేత.. మమతా బెనర్జీ దిక్కుమాలిన పరిపాలనకు చరమగీతం పాడేలా చేసింది భారతీయ జనతా పార్టీ.

రేఖా పాత్ర

రేఖ పాత్ర మమతా బెనర్జీ పార్టీకి సంబంధించిన గుండాల చేతిలో బాధపడింది.. సందేశ్ ఖాళీ ప్రాంతంలో సామూహిక అత్యాచారానికి గురైంది రేఖ. తనకు న్యాయం చేయాలని రేఖ అడిగినందుకు మమత ప్రభుత్వం ఎంత దారుణం చేయాలో అంత దారుణం చేసింది. ఈమెకు బిజెపి టికెట్ ఇచ్చింది. రేఖ తన సమీప టిఎంసి అభ్యర్థిపై 5421 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది.

రత్న

ఆర్జీ కార్ ఆస్పత్రిలో అత్యాచారానికి గురైన మహిళా వైద్యురాలి తల్లి. ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని మమత ప్రభుత్వం కాపాడింది. కానీ ఈమెకు టికెట్ ఇచ్చిన బిజెపి గెలిపించుకుంది. రత్న 28, 836 ఓట్ల తేడాతో విజయం సాధించింది.

కవిత మాజీ

ఈమె ఇళ్లల్లో పనులు చేసుకుంటూ జీవిస్తూ ఉంటుంది. ఈమెకు బిజెపి అంటే చాలా ఇష్టం. ఆ విషయం తెలిసిన టి.ఎం.సి కార్యకర్తలు ఈయన మీద భౌతిక దాడి చేశారు. ఈమెకు బిజెపి అధిష్టానం టికెట్ ఇచ్చింది. ఎన్నికల్లో తన సమీప టి యం సి అభ్యర్థిపై 8,333 ఓట్ల తేడాతో కవిత విజయం సాధించింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com