Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏం ఐడియా రైతన్న.. నీలాంటివాళ్లుంటే దేశానికి మేలు..రైతులకు లాభాలు..

ఏం ఐడియా రైతన్న.. నీలాంటివాళ్లుంటే దేశానికి మేలు..రైతులకు లాభాలు..

Oktelugu.com 2 days ago

Farmer innovative idea: ఆరుగాలం కష్టించి పండించిన పంట దొంగలపాలైతే ఆ రైతు కష్టం ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. గతంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉండేది.

ధాన్యం కుప్పల నుంచి కొందరు ధాన్యాన్ని దొంగిలించి తీసుకెళ్లేవారు. అయితే ఈ సమస్య పరిష్కారం కోసం ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. ఆ రైతు తీసుకున్న నిర్ణయంతో పాటు ఏర్పాటు చేసిన భద్రతా చర్యలపై అందరూ ప్రశంసిస్తున్నారు. ఇంతకీ ఆ రైతు ఏం చేశాడంటే..?

తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా పరిధిలో ఉన్న కొలనూరు గ్రామం లో ఓ రైతు తీసుకున్న జాగ్రత్త ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. గతంలో తన ధాన్యం కుప్పల నుంచి దొంగలు బస్తాలు ఎత్తుకెళ్లడంతో తీవ్రంగా నష్టపోయిన ఆ రైతు ఈసారి ముందుగానే అప్రమత్తమయ్యాడు. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి తన పంటను కాపాడుకునే ప్రయత్నం చేశాడు.

రైతులు నెలల తరబడి శ్రమించి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తుంటారు. అయితే కొన్ని చోట్ల రాత్రి సమయంలో ధాన్యం బస్తాల దొంగతనాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా కొనుగోలు ప్రక్రియ ఆలస్యం కావడంతో ధాన్యం కుప్పలు రోజుల తరబడి యార్డుల్లోనే ఉండాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని కొందరు దుండగులు బస్తాలు మాయం చేస్తున్నారని రైతులు చెబుతున్నారు.

ఇలాంటి అనుభవమే కొలనూరు గ్రామానికి చెందిన ఈ రైతుకూ ఎదురైంది. గత సీజన్‌లో తన ధాన్యం బస్తాలు కనిపించకుండా పోవడంతో అతడు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. అప్పట్లో సరైన ఆధారాలు లేకపోవడంతో దొంగలను గుర్తించడం కష్టమైందని గ్రామస్థులు చెబుతున్నారు. దీంతో ఈసారి ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందుగానే టెక్నాలజీ సహాయం తీసుకోవాలని రైతు నిర్ణయించుకున్నాడు.

ధాన్యం కుప్పల చుట్టూ ప్రత్యేకంగా సీసీ కెమెరాలను అమర్చి, రాత్రివేళల కదలికలను రికార్డ్ అయ్యేలా ఏర్పాటు చేశాడు. కెమెరాలకు లైటింగ్ సదుపాయం కూడా కల్పించడంతో ఎవరు వచ్చినా స్పష్టంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. రైతు తీసుకున్న ఈ చర్యను చూసి ఇతర రైతులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలో ఈ విషయం వైరల్ కావడంతో పలువురు రైతులు కూడా ఇలాంటి భద్రతా చర్యలపై ఆలోచిస్తున్నారు. 'పంట పండించడమే కాదు, దాన్ని కాపాడుకోవడం కూడా ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది' అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం మరింత భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది. రైతు తెలివైన నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తుండగా, మరోవైపు రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ సంఘటన చూపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com