Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
EMI Reduction : ఈఎంఐ భారమవుతోందా..? ఈ పని చేస్తే సగం తగ్గుతుంది..కొత్త లోన్లూ వస్తాయి..

EMI Reduction : ఈఎంఐ భారమవుతోందా..? ఈ పని చేస్తే సగం తగ్గుతుంది..కొత్త లోన్లూ వస్తాయి..

Oktelugu.com 5 days ago

EMI Reduction : ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డు బిల్లులు, పర్సనల్ లోన్లు చాలా మందికి భారంగా మారుతున్నాయి. ఇవి కొన్ని అవసరాలకు ఉపయోగపడినప్పటికీ అధిక వడ్డీ కారణంగా ప్రతి నెల చెల్లించే ఈఎంఐలతో అవస్థలు పడుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఈఎంఐ భారం తగ్గించే ప్రయత్నం చేస్తోంది ఈ ప్లాట్ ఫాం. ఇది నేరుగా రుణాలు ఇచ్చే సంస్థ కాదు. కానీ ఆర్బీఐలో నమోదైన ఎన్ బీఎఫ్ సీ తో భాగస్వామ్యంకావడంతో వినియోగదారులకు తక్కువ వడ్డీ రేటుతో రీ ఫైనాన్స్ అవకాశాన్ని కల్పిస్తుంది. ఇంతకీ అది ఏ ఫ్లాట్ ఫాం?

రుణం తీసుకునేటప్పుడు భాగానే ఉంటుంది. కానీ ఈఎంఐ చెల్లించేటప్పుడు భారంగా ఉంటుంది. ఈ భారాన్ని bllcut.com ద్వారా తొలగించుకోవచ్చని అంటున్నారు కొందరు ఆర్థిక నిపుణులు. దీని ద్వారా అధిక వడ్డీతో ఉన్న క్రెడిట్ కార్డ్ బకాయిలు లేదా ఇతర రుణాలను తక్కువ వడ్డీ రేటు ఉన్న కొత్త లోన్ లేదా ఈఎంఐ ప్లాన్‌లోకి మార్చే అవకాశాన్ని పరిశీలిస్తుంది. ఉదాహరణకు, ఒక క్రెడిట్ కార్డుపై సంవత్సరానికి 36 నుంచి 48 శాతం వరకు వడ్డీ చెల్లిస్తున్న వినియోగదారుడికి, భాగస్వామ్య NBFCల ద్వారా తక్కువ వడ్డీతో రుణం అవకాశం కల్పిస్తుంది. అదే బకాయిని ఒక స్థిరమైన ఈఎంఐ రూపంలో మార్చే అవకాశం ఉంటుంది.

మొదట BillCut వెబ్‌సైట్ లేదా యాప్‌లో మొబైల్ నంబర్‌తో నమోదు చేసుకోవాలి. అనంతరం పాన్ వంటి వివరాలు ఇచ్చి, క్రెడిట్ ప్రొఫైల్‌ను పరిశీలించేందుకు వినియోగదారుడు అనుమతి ఇవ్వాలి. ఆ తర్వాత సిబిల్ స్కోర్, ప్రస్తుతం ఉన్న రుణాలు, బకాయిలు, చెల్లింపు చరిత్ర వంటి వివరాలను విశ్లేషించి, అర్హత ఉంటే అందుబాటులో ఉన్న లోన్ లేదా ఈఎంఐ ఆఫర్లను చూపిస్తుంది. వినియోగదారు ఆ ఆఫర్‌ను అంగీకరిస్తే, కొత్త లోన్ ద్వారా పాత అధిక వడ్డీ బకాయిని క్లియర్ చేసి, కొత్త ఈఎంఐ ప్లాన్ ప్రారంభమవుతుంది.

కేవలం క్రెడిట్ కార్డులకే కాకుండా పర్సనల్ లోన్లు, హోమ్ లోన్లు, కార్ లోన్లు వంటి రుణాల భారాన్ని తగ్గించుకునేందుకు దీనిని ఎంపిక చేసుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కరూ ఇందులో అర్హత పొందుతారని చెప్పలేం. వినియోగదారుడి క్రెడిట్ స్కోర్, ఇప్పటికే ఉన్న రుణ భారం ల ఆధారంగా అర్హత నిర్ణయిస్తారు. అర్హత ఉంటే మాత్రమే తక్కువ వడ్డీతో కొత్త లోన్ ఆఫర్ లభిస్తుంది.

అయితే బిల్ కట్ సేవలు ఉపయోగించే సమయంలో ప్లాట్‌ఫామ్ ఫీజు లేదా ప్రాసెసింగ్ ఛార్జీలు ఉండే అవకాశం ఉంది. అదనంగా, రుణం మంజూరు చేసే ఎన్ బీఎఫ్ సీలు తమ నిబంధనల ప్రకారం ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలు వసూలు చేయవచ్చు. కాబట్టి ఏ ఆఫర్‌ను అంగీకరించే ముందు వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు, మొత్తం చెల్లించాల్సిన మొత్తం వంటి వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com