Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ బాధ్యతలను మరో దర్శకుడికి అప్పజెప్పిన ప్రశాంత్ నీల్...

ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ బాధ్యతలను మరో దర్శకుడికి అప్పజెప్పిన ప్రశాంత్ నీల్...

Oktelugu.com 2 weeks ago

NTR Dragon movie update: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'డ్రాగన్' (వర్కింగ్ టైటిల్) సినిమా భారీ బడ్జెట్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.

మూవీ స్టార్ట్ అయి సంవత్సరన్నర సమయం అయినప్పటికి ఇప్పటి వరకు ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ కాలేదు. ఇక ఈ నెల 20వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఒక గ్లింప్స్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఈ సినిమా దర్శకుడు అయిన ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఈ సినిమాకి మాటలు రాసే బాధ్యతని దేవకట్టా కి అప్పజెప్పాడు. ఇక ఇదంతా చూస్తున్న ఎన్టీఆర్ అభిమానులు మాత్రం అంటే ఇప్పటి వరకు మూవీ కి సంబంధించిన టాకీ పార్టీ ఏం షూట్ చేయలేదా? ఎందుకని ఇప్పుడు అతనికి డైలాగులు రాసే బాధ్యతను అప్పజెప్తున్నారు అంటూ ఎన్టీఆర్ అభిమానులు సైతం ప్రశాంత్ నీల్ మీద తీవ్రమైన వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు.

కానీ వాస్తవానికి సినిమాలోని కొన్ని కోర్ సన్నివేశాలకు డైలాగులు అంత పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదట. దాంతో ఆల్రెడీ రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాకి డైలాగ్ రైటర్ గా వ్యవహరిస్తున్న దేవకట్టతో ఈ సినిమా డైలాగ్స్ రాయించాలని అనుకున్నారట. అందుకే రీసెంట్ గా దేవకట్టా ను కలిసి అతనికి పూర్తి కథను చెప్పి డైలాగ్స్ రాసే బాధ్యతను తన చేతిలో పెట్టినట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ఏ అప్డేట్ అయితే రాలేదు. మరి ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్లు సినిమా మీద హైప్ ను పెంచుతాయా లేదంటే హైప్ ను తగ్గించే ప్రయత్నం చేస్తాయా అనేది తెలియాల్సి ఉంది.

మొత్తానికైతే దేవకట్టతో కొలబ్రేట్ అయిన ప్రశాంత్ నీల్ అతని నుంచి ఎలాంటి ఔట్ పుట్ ను రాబట్టుకుంటాడు. తన రాసే డైలాగులు సినిమాకి ఏ రకంగా హెల్ప్ అవుతాయి. యావత్ ప్రేక్షకలోకాన్ని మెప్పించగలిగే డైలాగ్స్ దేవకట్ట రాయగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com