Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఎన్టీఆర్ కి బ్యాడ్ టైమ్ నడుస్తుందా...

ఎన్టీఆర్ కి బ్యాడ్ టైమ్ నడుస్తుందా...

Oktelugu.com 1 week ago

NTR Bad Time: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు సాగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతుండటం విశేషం… రాజమౌళి డైరెక్షన్లో రామ్ చరణ్ తో కలిసి చేసిన 'త్రిబుల్ ఆర్' సినిమా భారీ విజయాన్ని సాధించింది.

అయితే ఈ సినిమా 1300 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టడంతో అటు జూనియర్ ఎన్టీఆర్ ఇటు రామ్ చరణ్ ఇద్దరు కూడా పాన్ ఇండియాలో ఒక వండర్ ని క్రియేట్ చేశారు. ఈ సినిమాకి 1300 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి. ఇక్కడ వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు కలిసి నటించారు. సోలో హీరో ఎవరో ఒకరు చేసి ఉంటే అంత భారీ కలెక్షన్స్ రాకపోయి ఉండేవని కొంతమంది సినిమా మేధావులు వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి రాజమౌళి సినిమాల్లో హీరో చాలా బాగా ఎలివేట్ అవుతుంటాడు. అందుకే అతనితో సినిమా చేయడానికి ఇండియాలో ఉన్న స్టార్ హీరోలు అందరు ఎదురు చూస్తుండటం విశేషం…ఇక ఇప్పటివరకు ఆయనతో సినిమాలు చేసిన ప్రతి ఒక్కరికి భారీ సక్సెస్ లను అందించాడు. ప్రస్తుతం మహేష్ బాబుకు సైతం ‘వారణాసి ‘ సినిమాతో భారీ విజయాన్ని కట్ట బెట్టాలని చూస్తున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ మాత్రం సోలో హీరోగా 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టే సినిమాలు చేయలేదు. ఈ మధ్యకాలంలో అతని గ్రాఫ్ కూడా బాగా తగ్గిపోతుంది. తన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా వరకు తగ్గింది అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ ప్రూవ్ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇది కనక వర్కౌట్ కాకపోతే మాత్రం ఎన్టీఆర్ సినిమా కెరియర్ ప్రమాదం లో పడుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ‘దేవర ‘ సినిమా మంచి విజయాన్ని సాధించిన కూడా ఆ సినిమాకి భారీ కలెక్షన్స్ రాలేదు.

కేవలం 600 కోట్ల వరకు మాత్రమే కలెక్ట్ చేసింది. దీనితో ఎన్టీఆర్ ఇతర హీరోలతో పోలిస్తే చాలా వరకు వెనుకబడిపోయాడని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు అనుకున్నట్టుగానే జూనియర్ ఎన్టీఆర్ వెనుకబడిపోయాడా? లేదంటే డ్రాగన్ సినిమాతో మరోసారి తతన బ్యాడ్ టైం అంతా పోయి గుడ్ టైమ్ వస్తుందా అనేది చూడాలి…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com