Dailyhunt
గద్దను, పాము చుట్టేసింది.. సడన్ గా సింహాల ఎంట్రీ.. అడవి మొత్తం దద్దరిల్లింది.. మామూలు వీడియో కాదిదీ

గద్దను, పాము చుట్టేసింది.. సడన్ గా సింహాల ఎంట్రీ.. అడవి మొత్తం దద్దరిల్లింది.. మామూలు వీడియో కాదిదీ

Oktelugu.com 1 week ago

Eagle Snake fight video Lions entry: ఆ గద్ద అడవి మొత్తం తిరిగింది. వేటాడేందుకు ఒక్క జంతువు కూడా దొరకలేదు. అలసిపోయి. ఒక రాయి మీద కూర్చుంది. దాని వెనకాల ఒక తాచు పాము వచ్చేసింది.

ఆ గద్దను అమాంతం పట్టుకుంది. దానిని మింగేయడానికి ప్రయత్నించింది. కానీ ఆ గద్ద పెద్దదిగా ఉండడంతో పాము ఆటలు సాగలేదు..

పాము అమాంతం ఆ గద్దను పట్టేసుకుని రాయి నుంచి కిందకు దూకింది. గద్దను కాటు వేయడానికి అనేకసార్లు ప్రయత్నించింది. గద్ద చాకచక్యంగా తప్పించుకుంది. అయినప్పటికీ గద్ద కాళ్లను పాము పట్టేసుకుంది. పామును విడిపించుకోవడానికి గద్ద.. గద్దను తినేయడానికి పాము.. ఇలా ఆ రెండు జంతువుల మధ్య పెనుగులాట జరుగుతోంది. ఇంతలోనే సింహాల బృందం అక్కడికి వచ్చింది. ఆ పామును చూడగానే ఓ సింహంలో ఆకలి కలిగింది. వెంటనే ఆ పామును తినేయడానికి వచ్చింది.. ఆ పాము మీద దాడి చేసింది. ఆ పామును సింహం నోటితో లాగింది. ఈలోగానే ఆ గద్ద బయటపడింది.. బతుకు జీవుడా అనుకుంటూ రెక్కలను ఆడించుకుంటూ ఎగిరిపోయింది.

ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. కాకపోతే ఈ దృశ్యాలను నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ ప్రసారం చేసింది.. గద్ద, పాము, సింహం మధ్య జరిగిన పోరాటం అడవిని మొత్తం దద్దరిల్లే విధంగా చేసింది. సింహం, పాము, గద్ద ఇలా భిన్నమైన జంతువుల మధ్య జరిగిన పోరాటం వింతగా ఉందని చూసిన వాళ్ళు చెబుతున్నారు.. అడవుల్లో ఈ తరహా పోరాటాలు అరుదుగా జరుగుతాయి.. అయితే నేషనల్ జియోగ్రాఫిక్ ప్రతినిధులు చాలాసేపు ఎదురుచూసిన తర్వాత ఈ పోరాటం వారికి కనిపించింది.. దీనిని అత్యంత జాగ్రత్తగా వారు తమ కెమెరాలలో బంధించారు.

“అంతటి నల్ల తాచుపాము గద్దను చుట్టేసుకుంది. గద్ద పామును గమనించలేదా.. లేదా పాము చాకచక్యంగా పట్టేసుకుందా.. తెలియదు గాని ఈ దృశ్యాలు చూస్తుంటే వెన్నులో వణుకు పుడుతుంది. ఈ దృశ్యాలను లైవ్ లో చూస్తున్నవారు ఎలా ఉన్నారో తెలియదు.. కానీ ఇటువంటి సన్నివేశాలు చూడడం ఇదే తొలిసారి అని” నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com