Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గంగూలీ అంటే అమిత్ షా కు ఎందుకు అంత కోపం.. బెంగాల్ దాదాకు గడ్డు కాలమే..

గంగూలీ అంటే అమిత్ షా కు ఎందుకు అంత కోపం.. బెంగాల్ దాదాకు గడ్డు కాలమే..

Oktelugu.com 2 weeks ago

Sourav Ganguly And Amit Shah: కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఒక్కసారి మనసులో అనుకుంటే చాలు.. అతడు ఎవరైనా సరే సర్దుకోవాల్సిందే. కాకపోతే అమిత్ షా హెచ్చరికలు నేరుగా చేయరు.

టార్గెట్ ఫిక్స్ అయిన తర్వాత.. దానికి సంబంధించిన కార్యాచరణ వేగంగా సాగిపోతూ ఉంటుంది. చాప కింద నీళ్లు వచ్చేదాకా కూడా తెలియదు.. చేసింది అమిత్ షా అని.. ఆ తర్వాత అనుకున్నప్పటికీ ఉపయోగముండదు. ఇప్పుడు ఈ పరిస్థితిని టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అనుభవిస్తున్నారు.

గంగూలీ సమర్థవంతమైన ఆటగాడు. టీమిండియాకు.. బెంగాల్ క్రికెట్ కు.. బీసీసీఐకి ఆయన ఎన్నో సేవలందించారు. అప్పట్లో మమతా బెనర్జీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. ఆమెకు సహకరించారు. కొన్ని సందర్భాలలో ఆయన రాజకీయ పార్టీ పెడుతున్నట్టు వార్తలు వచ్చినప్పటికీ.. అవి ఏవి నిజం కాలేదు. కాకపోతే మమతా బెనర్జీకి ఆయన పరోక్షంగా సపోర్ట్ చేసేవారు. అయితే ఇప్పుడు బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వం ఓడిపోయింది. మమతా బెనర్జీ.. ఆమె అల్లుడు అభిషేక్ బెనర్జీ చుక్కలు చూస్తున్నారు. వారికి ఇప్పటికే మాస్టర్ స్ట్రోక్లు ఇచ్చేసింది బిజెపి. ఇప్పుడు తర్వాతి టార్గెట్ గంగూలీ.

గంగూలీ కి బిజెపి ప్రభుత్వం సెక్యూరిటీ తగ్గించేసింది. గంగూలికి ఉన్న జెడ్ కేటగిరి భద్రతను వై కేటగిరికి తగ్గించింది. అనేక కారణాల వల్ల 2023లో నాటి మమతా ప్రభుత్వం వై కేటగిరి భద్రతను జెడ్ కేటగిరీగా మార్చేసింది. వై కేటగిరిలో ఉన్నప్పుడు గంగూలికి స్పెషల్ కేటగిరీలో ఉన్న పోలీసు అధికారులు ముగ్గురు సెక్యూరిటీ ఇచ్చేవారు. ముగ్గురు పోలీసులు ఆయన ఇంటికి కాపలాగా ఉండేవారు. 2023 తర్వాత జెడ్ కేటగిరి కింద గంగులకి 8 నుంచి పదిమంది పోలీసులు సెక్యూరిటీ ఇచ్చేవారు.

బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జెడ్ కేటగిరి సెక్యూరిటీ లో ఉన్న వారందరి జాబితాను పరిశీలించింది. ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం గంగులికి ఉన్న ముప్పును సమీక్షించింది. ఆ తర్వాత అతడికి జెడ్ నుంచి వై కేటగిరికి భద్రతను మార్చేసింది. అంతేకాదు అతడికి సెక్యూరిటీ కల్పించే సిబ్బంది విషయంలో కూడా కోత విధించేసింది. దీంతో సౌరవ్ గంగూలీ విషయంలో అమిత్ షా అనుకున్నది చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

గతంలో మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు.. ఆమెకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు బిజెపి అనేక ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా బెంగాల్ దాదాను పార్టీలోకి రావాలని కమలం నేతలు ఆహ్వానించారు. ఈ వ్యవహారం మొత్తం అమిత్ షా సాగించారు. అయితేనాడు గంగూలీ బిజెపిలోకి రాకపోగా.. మమత ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో దానిని మనుసులో పెట్టుకున్న అమిత్ షా ఇప్పుడు ఇలా రివేంజ్ తీర్చుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే గంగూలి మీద అమిత్ షా కు ఎటువంటి కోపం లేదని.. ఇదంతా సాధారణంగా జరిగే ప్రక్రియ అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com