Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గెలిచి 24 గంటలు కూడా అవ్వలేదు.. అప్పుడే రాజీనామాకు సిద్దమైన విజయ్..

గెలిచి 24 గంటలు కూడా అవ్వలేదు.. అప్పుడే రాజీనామాకు సిద్దమైన విజయ్..

Oktelugu.com 2 weeks ago

Vijay resignation: తమిళ సూపర్ స్టార్ విజయ్(Thalapathy Vijay) TVK పార్టీ ని స్థాపించిన రెండేళ్లలోనే అధికారం లోకి వచ్చి ముఖ్యమంత్రి అవ్వడం ఇప్పుడు దేశ రాజకీయాల్లో సంచలనం గా మారింది.

ఎన్టీఆర్ , MGR తర్వాత , పార్టీ పెట్టిన అతి తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన ఏకైక నేటి తరం హీరోగా విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతే కాదు ఆయన పోటీ చేసిన రెండు స్థానాలు పెరంబూర్ , త్రిచి ఈస్ట్ లలో భారీ మెజారిటీ తో గెలిచాడు. అయితే రూల్స్ ప్రకారం రెండు స్థానాల్లో పోటీ చేసి గెలిచినప్పుడు ఒక స్థానంలో ఆరు నెలల్లో రాజీనామా చెయ్యాలి. ఆ ప్రాంతం లో ఉప ఎన్నికలు నిర్వహిస్తారు. విజయ్ ఏ స్థానానికి రాజీనామా చేయబోతున్నాడు అనే దానిపై నిన్న పెద్ద ఎత్తున సాగిన చర్చ. నేడు తన పార్టీ నేతలతో చర్చిన విజయ్ , ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

త్రిచి ఈస్ట్ స్థానానికి ఆయన రాజీనామా చేయబోతున్నట్టు సమాచారం. ఇక్కడ తన పార్టీ నుండి మరో అభ్యర్థిని నిలబెట్టి పోటీ చేయించబోతున్నాడు విజయ్. ఆ అభ్యర్థి మరెవరో కాదు , తమిళ హీరోయిన్ త్రిష అని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. మరోపక్క విజయ్ కే మెజారిటీ కి కావాల్సినంత సీట్స్ రాలేదు. తమిళనాడు లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 118 సీట్లు అవసరం కాగా, విజయ్ TVK కి 107 సీట్లు మాత్రమే వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటు అవసరమయ్యే ఆ 11 సీట్ల కోసం , విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటాడు అనే దానిపై ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. AIDMK తో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని కొందరు, కాంగ్రెస్ మరియు ఇతర చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందని మరి కొందరు సూచిస్తున్నారు.

విజయ్ కాంగ్రెస్ పార్టీ తో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. కాంగ్రెస్ అధిష్టానం కూడా అందుకు అంగీకరించింది. కానీ కాంగ్రెస్ కి కేవలం 5 సీట్లు మాత్రమే వచ్చింది. అదే విధంగా కమ్యూనిస్ట్ పార్టీలకు చెరో 2 సీట్లు రాగా, సీనియర్ హీరో, దివంగత నేత విజయకాంత్ స్థాపించిన పార్టీ DMDK కి 1 సీటు వచ్చింది. వీటితో పాటు మరి కొన్ని PMC వంటి పార్టీల మద్దతు కూడా లభించేలా ఉందని సమాచారం. ఇలా చర్చల చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం విజయ్ గవర్నర్ ని 14 రోజుల సమయం కోరాడు. నేడు ఆయన ఈ విషయంపై చర్చించేందుకు గవర్నర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాడు. రాబోయే రోజుల్లో తమిళనాడు రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారబోతున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com