Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Gen Z Politics: రెండు తెలుగు రాష్ట్రాల్లో జన్ జడ్ నాయకుడెవరు..

Gen Z Politics: రెండు తెలుగు రాష్ట్రాల్లో జన్ జడ్ నాయకుడెవరు..

Oktelugu.com 1 week ago

Gen Z Politics: నీట్ ఉద్యమంతో దేశ రాజకీయాలలో జన్ జడ్ పాత్ర పై చర్చలు సాగుతున్నాయి.. యువతరం ఆగ్రహంగా ఉండడం.. తాత్కాలిక ఉపశమనం కాకుండా.. తాము ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో..

రెండు తెలుగు రాష్ట్రాలలో జనరేషన్ జెడ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారిపోయాయి.

జనరేషన్ జెడ్ తరంలో ఎక్కువగా యువకులే ఉంటారు. మరి వీరిని ఆకర్షించి.. తమ రాజకీయాలకు అనుగుణంగా మలుచుకునే రాజకీయ పార్టీలు ఏవి.. అంత చరిష్మా ఉన్న రాజకీయ నాయకుడు ఎవరు.. అనే చర్చ రెండు తెలుగు రాష్ట్రాలలో జోరుగా సాగుతోంది.

ఏపీ రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్ డిఎస్సి లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. జనరేషన్ జెడ్ తరం ఉద్యమించాలని పిలుపునిస్తున్నారు. బొద్దింకల మాదిరిగా ఏపీ యువత రోడ్లమీదకి రావాలని అంటున్నారు. తన మాటల ద్వారా.. తన సొంత మీడియా ద్వారా జగన్ పిలుపునిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు కీలక నాయకుడు. దశాబ్దాలుగా ఆయన టిడిపికి నాయకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కుమారుడు లోకేష్ చంద్రబాబుకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నారు. తన రాజకీయాలకు మరింత నైపుణ్యం జోడిస్తున్నారు. యువతరాన్ని ఆకట్టుకోవడానికి జగన్ గతంలో యువ గళం పేరుతో పాదయాత్ర నిర్వహించారు. యువతను ఆకట్టుకోవడానికి లోకేష్ రకరకాల కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. లోకేష్ చేతిలో విద్యాశాఖ.. ఐటీ శాఖ ఉండడం అత్యంత సానుకూలమైన అంశం.

ఏపీ రాష్ట్రంలోనే డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ కూడా గతంలోనే ఆయన యువతరాన్ని ఆకర్షించారు. తన ప్రసంగాల ద్వారా యువతరాన్ని ఆకట్టుకున్నారు. జనసేనలో యువకులకు ఆయన పెద్దపీట వేశారు. ఒకరకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో జనరేషన్ జెడ్ తరానికి విస్తృతమైన అవకాశాలు కల్పించిన నాయకుడిగా పవన్ కళ్యాణ్ పేరు తెచ్చుకున్నారు. మిగతా నాయకులు జనరేషన్ జెడ్ తరాన్ని ఆకర్షించడానికి ప్రయత్నాలు చేయాలి. కానీ పవన్ అలా కాదు.. ఎందుకంటే ఆయన యువకుడిగా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి వచ్చారు. యువత రాజకీయాల్లోకి వస్తే ఎటువంటి మార్పులు జరుగుతాయో ఆయన గతంలోని నిరూపించారు. అందువల్ల జనరేషన్ జెడ్ లో ఎక్కువ ఆకర్షణ కలిగిన రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ ముందు వరసలో కాదు.. ముందు స్థానంలోనే ఉంటారు.

తెలంగాణలో సిరిసిల్ల ఎమ్మెల్యే, భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ యువతరాన్ని ఆకర్షించే పనిలో పడ్డారు . గతంలో ఈయన ఐటి శాఖ మంత్రిగా పనిచేయడం కలిసి వచ్చింది. అప్పట్లోనే ఈయన యువతరాన్ని ఆకర్షించడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కూడా యువతతో నిత్యం టచ్ లో ఉంటున్నారు. ఇంటర్వ్యూలు.. ఇతర కార్యక్రమాలు కేవలం యువత ద్వారా మాత్రమే ఆయన చేస్తున్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది.ఈయన యువకులతో ఎక్కువగా మాట్లాడుతుంటారు. 50 ఏళ్లు దాటినప్పటికీ కుర్రాడి లాగానే రేవంత్ ఉంటారు. జనరేషన్ జడ్ తరాన్ని ప్రభావితం చేయగల సత్తా రేవంత్ సొంతం.

అటు నారా లోకేష్.. మధ్యలో పవన్ కళ్యాణ్.. ఇటు కేటీఆర్.. జగన్.. రేవంత్.. వీళ్లకు బలమైన నాయకత్వగణం ఉంది. కార్యకర్తల బలం ఉంది. పైగా వీళ్ళ పార్టీలకు ప్రజల్లో విస్తృతమైన గుర్తింపు ఉంది.. ఈ నేపథ్యంలో వీరు జనరేషన్ జెడ్ తరాన్ని ప్రభావితం చేయగలుగుతారా.. జనరేషన్ జెడ్ తరం ఆకాంక్షలకు ప్రతీకగా నిలవగలుగుతారా.. వచ్చే ఎన్నికల్లో భవిష్యత్తు ఆశకిరణాలుగా నిలబడగలుగుతారా.. ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com