Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Ginger Tea Benefits: సాధారణ టీ కంటే అల్లం టీ ఎందుకు మంచిది..?

Ginger Tea Benefits: సాధారణ టీ కంటే అల్లం టీ ఎందుకు మంచిది..?

Oktelugu.com 4 days ago

Ginger Tea Benefits: ఉదయం నిద్ర లేవగానే చాలా మంది మనసు చాలా నిద్రమత్తులో ఉంటుంది. దీనిని పోగొట్టేందుకు, రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు టీ లేదా కాఫీ తీసుకుంటారు.

ఈ పదార్థాల్లో ఉండే కెఫిన్ తో మనసులో ఉత్తేజాన్ని నింపి రోజంతా పనులు చక్కగా చేయగలిగే శక్తిని ఇస్తుందని చాలా మంది భావన. అయితే ఈ సమయంలో సాధారణ టీ కంటే అల్లం టీ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అసలు అల్లం టీలో ఏముంటాయి? దీనిని ఎందుకు తీసుకోవాలి?

ప్రస్తుతం వర్షాకాలం. వాతావరణంలో అనేక మార్పులు ఉంటాయి. ఈ సమయంలో శరీరంలో రోగ నిరోధక శక్తిని ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇందు కోసం ప్రతిరోజూ తినే సాధారణ పదార్థాలతో పాటు అదనపు బూస్ట్ ను అందించేందుకు ప్రత్యేక పదార్థాలు తీసుకోవాలి. ఇందులో భాగంగా ప్రత్యేక పానీయాలు తీసుకోవడం వల్ల శరీరంలో జీర్ణక్రియ సులభంగా ఉండి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ప్రత్యేక పానీయాల్లో అల్లం, శొంటి టీలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే శరీరానికి హానికరమైన ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడతాయి.

భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు ఉండే అవకాశం ఉంది. ఇలాంటి వారికి అల్లం టీ మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. దీనిని తాగడం వల్ల జీర్ణ రసాల ఉత్పత్తిని ప్రోత్సహించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ప్రయాణ సమయంలో వచ్చే వికారం, వాంతుల భావనను కూడా తగ్గించడంలో అల్లం ఉపయోగపడుతుంది. అల్లం టీ అప్పుడప్పుడు తాగడం వల్ల శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. వైరస్‌లు, బ్యాక్టీరియాల వల్ల వచ్చే సాధారణ ఇన్‌ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తి అల్లం టీకి ఉంటుంది. అందుకే సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే ఈ సమయంలో అల్లం టీ తాగాలని నిపుణులు సూచిస్తుంటారు.

జలుబు, గొంతు నొప్పి, దగ్గు వంటి సమస్యలు వచ్చినప్పుడు అల్లం టీ మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఇందులోని వేడి గుణం గొంతుకు ఉపశమనం కలిగిస్తుంది. శ్వాసనాళాల్లో పేరుకుపోయిన కఫాన్ని పలుచబరచి బయటకు రావడానికి కూడా ఇది సహాయపడుతుంది. కడుపులో అసౌకర్యం, వికారం లేదా స్వల్ప కడుపునొప్పి ఉన్నప్పుడు వేడి వేడి అల్లం టీ తాగితే ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది.

అయితే అల్లం టీ అందరికీ ఒకే విధంగా సరిపోదు. తరచూ ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ అల్సర్ సమస్యలు ఉన్నవారు లేదా శరీరంలో అధిక వేడి ఉండేవారు మితంగా మాత్రమే తీసుకోవాలి. రక్తాన్ని పలుచబరిచే మందులు వాడుతున్నవారు, గర్భిణులు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com