Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గ్రామ సింహాలకు చుక్కలు చూపించాడు...కుక్కల ప్రేమికులారా.. దయచేసి ఈ వీడియో చూడకండి..

గ్రామ సింహాలకు చుక్కలు చూపించాడు...కుక్కల ప్రేమికులారా.. దయచేసి ఈ వీడియో చూడకండి..

Oktelugu.com 3 weeks ago

Village Dogs Viral Video: మన దేశంలో వీధి కుక్కలు కరచి ప్రతి సంవత్సరం చాలామంది గాయపడుతుంటారు. ఇటీవల కాలంలో రేబిస్ వంటి వ్యాధికి చాలామంది చనిపోతున్నారు.

కుక్కల వల్ల చోటుచేసుకుంటున్న మరణాలకు సంబంధించిన కేసులు ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్తున్నాయి. సుప్రీంకోర్టు కూడా ఈ అంశంపై అనేకసార్లు స్పందించింది. వీధి కుక్కలను దూరంగా ఉంచాల్సిందేనని.. అవసరమైతే సంహరించాల్సిందేనని అనేక సందర్భాల్లో తీర్పులను వెల్లడించింది.

మనదేశంలో కుక్కల ప్రేమికులకు సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో వెల్లడించిన తీర్పులు రుచించలేదు. అందువల్లే అనేక సందర్భాలలో సుప్రీంకోర్టు మెట్లను.. ఇంకా రకరకాల మార్గాలను అన్వేషించారు. ఆయనప్పటికీ కుక్కల ప్రేమికులకు అనుకూలమైన తీర్పురాలేదు. సానుకూలమైన నిర్ణయం రాలేదు. అయినప్పటికీ వారు వెనుకడుగు వేయడం లేదు. సోషల్ మీడియాలో ఉద్యమాలు.. ఆన్లైన్ వేదికలలో రకరకాల వ్యవహారాలు సాగిస్తున్నారు.

కుక్కల ప్రేమికులకు తెలియని అసలు విషయం ఏంటంటే.. వీధి కుక్కల వల్ల ప్రతి ఏడాది వేలాదిమంది గాయపడుతున్నారు. చాలామంది చనిపోతున్నారు. రేబిస్ సోకినప్పుడు మనిషిలో కనిపించే లక్షణాలు అత్యంత దారుణంగా ఉంటాయి. మనిషిలాగ ఉండేప్పటికీ జంతువు లాగా అతని ప్రవర్తించే తీరు భయంకరంగా ఉంటుంది. అటువంటి వ్యాధి కుక్కల ప్రేమికుల కుటుంబ సభ్యులకు వస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. అందువల్లే ఇటీవల కాలంలో కుక్కల ప్రేమికుల మీద సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

సోషల్ మీడియాలో కుక్కల ప్రేమికులకు కనువిప్పు కలిగించే ఒక వీడియో ఒకటి విపరీతంగా సర్కులేట్ అవుతోంది. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. ఎప్పుడు జరిగిందో తెలియదు. కానీ ఒక వ్యక్తి అర్థరాత్రి పూట నడుచుకుంటూ ఇంటికి వస్తున్నాడు.. అతడిని కొన్ని వీధి కుక్కలు వెంబడించాయి. కరిచేందుకు ప్రయత్నించాయి. అయితే అతడు ఏమాత్రం భయపడకుండా ఆ కుక్కల మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. కుక్కలను ముందుగా బెదిరించాడు. అవి మాట వినకపోవడంతో.. తట్టుకోలేక తన వైల్డ్ ఫైర్ అవతారాన్ని చూపించాడు. వెంటనే తన చేతుల్లోకి ఒక కుక్కను తీసుకొని అటు ఇటు తిప్పాడు. దీంతో మిగతా కుక్కలు భయపడిపోయాయి. అతడిని చూసి పారిపోయాయి.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. కుక్కల ప్రేమికులు ఇప్పుడు మాట్లాడతారా.. ఈ వీడియో చూసిన తర్వాత నిశ్శబ్దంగా ఉండిపోతారా.. లేక సుప్రీంకోర్టులో కేసులు వేస్తారా.. తెలుసుకోండి అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. అదే కాదు ఆ వ్యక్తి కుక్కలను ఆ విధంగా తరిమి కొట్టడంతో అతని మీద ప్రశంసలు జల్లు కురుస్తోంది. గొప్ప పని చేశావు అంటూ అందరూ అతడిని సోషల్ మీడియా వేదికగా అభినందిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com