Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Green Card Rules : అమెరికా గ్రీన్ కార్డ్.. ఇప్పుడు మరింత కఠినం..

Green Card Rules : అమెరికా గ్రీన్ కార్డ్.. ఇప్పుడు మరింత కఠినం..

Oktelugu.com 18 hrs ago

Green Card Rules :అమెరికాలో గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న వారికి అక్కడ ప్రభుత్వం షాక్ నిచ్చింది.త్వరలో ఈ విషయంలో కీలకమైన మార్పులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

వచ్చే సెప్టెంబర్ లో పబ్లిక్ ఛార్జ్ నిబంధనలను మరింత విస్తృతంగా అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో బైడెన్‌ కాలం నాటి పబ్లిక్ ఛార్జ్ పై ఫైనల్ రూల్ తీసుకొచ్చింది. దీనిపై పూర్త వివరాల్లోకి వెళితె..

అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టంలో పబ్లిక్ ఛార్జ్ అంటే.. ప్రభుత్వ ఆర్థిక సహాయంపై ఆధారపడడం. కొత్తగా గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసేవారి దరఖాస్తులపై ఇప్పుడు ప్రత్యేకంగా పరిశీలన చేయనున్నారు. వీరు భవిష్యత్ లో ప్రభుత్వంపై ఆర్థికంగా ఆధారపడే అవకాశముందా? లేదా? అనే అంశాన్ని పరిశీలిస్తారు. అలా ఆధారపడే వ్యక్తి విషయంలో కొన్ని నిబంధనలు ఉంచుతారు. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రయోజనం పొందిన వ్యక్తిపై మాత్రం ఎలాంటి ఆంక్షలు ఉండకపోవచ్చు. అంతేకాకుండా వారిని పబ్లిక్ ఛార్జ్ ప్రకటించి గ్రీన్ కార్డు మంజూరు చేస్తారు.

2022 సంవత్సరంలో అప్పటి బైడెన్‌ ప్రభుత్వం పబ్లిక్ చార్జ్ ను తీసుకొచ్చారు. గ్రీన్ కార్డు ద్వారాప్రభుత్వ సహాయం కోసం ఆధారపడేవారి విషయంలో తీసుకొచ్చిన నిబంధన. అయితే వలసదారులను దేశంలోకి రాకుండా ఆపకూడదనే ఉద్దేశంలో నిబంధననల్లో సరళీకరించింది. ఆ సమయంలో వీరు దరఖాస్తు చేసుకుంటే దరఖాస్తు తిరస్కరించరాదని వెసులుబాటు కల్పించారు.

అయితే కొత్త మార్గదర్శకాల ప్రకారం ఆదాయ అర్హత ఆధారంగా ఇచ్చే ప్రభుత్వ ప్రయోజనాల పరిధి విస్తరించనుంది. ఇందులో నగదు సహాయం మాత్రమే కాకుండా హౌసింగ్ అసిస్టెన్స్, ఫుడ్ అసిస్టెన్స్, కొన్ని విద్యా ఆర్థిక సహాయాలు వంటి ప్రయోజనాలను కూడా అధికారులు పరిశీలిస్తారు. అయితే ఏ ప్రయోజనం ఏ కేసులో ఎలా పరిగణించబడుతుందనేది దరఖాస్తుదారు వర్గం, ప్రయోజనం స్వభావం, ఇతర పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

అమెరికాలో కుటుంబ ఆధారిత, ఉద్యోగ ఆధారిత మార్గాల్లో గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా దీర్ఘకాలంగా అమెరికాలో స్థిరపడాలని చూస్తున్న వారికి కొత్త పబ్లిక్ ఛార్జ్ పరీక్షలో ఆర్థిక స్థితి, ఉద్యోగ చరిత్ర, విద్య, కుటుంబ పరిస్థితి వంటి అంశాలు మరింత ప్రాధాన్యం పొందవచ్చు. అందువల్ల గ్రీన్ కార్డు దరఖాస్తుదారులు తమ ఇమ్మిగ్రేషన్ కేటగిరీకి ఈ నిబంధన వర్తిస్తుందా? లేదా? అనేది ముందుగానే తెలుసుకోవడం ముఖ్యం.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com