Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైపర్ ఆది వల్లే జబర్దస్త్ వదిలేశా, వెళ్ళేటప్పుడు వేడుకున్నా, అనసూయ సంచలన కామెంట్స్

హైపర్ ఆది వల్లే జబర్దస్త్ వదిలేశా, వెళ్ళేటప్పుడు వేడుకున్నా, అనసూయ సంచలన కామెంట్స్

Oktelugu.com 10 months ago

Hyper Aadi vs Anasuya truth: తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ ని అనసూయ ఎందుకు మానేశారు? అనే సందేహాలు చాలా కాలంగా ఉన్నాయి. పలు సందర్భాల్లో అనసూయ దీనిపై స్పందించారు.

iframe{min-width: 0px !important;box-sizing: border-box;}

వివిధ కారణాలు చెప్పింది. అయితే తాను జబర్దస్త్ వదిలేయడానికి హైపర్ ఆదినే కారణం అంటూ బాంబు పేల్చింది అనసూయ.

బిగ్ బాస్ 9' లో ఎప్పుడూ లేని సరికొత్త రూల్స్..కంటెస్టెంట్స్ ని ఏమి చేయాలనుకుంటున్నారు?

2013లో జబర్దస్త్(JABARDASTH) కామెడీ షో ప్రయోగాత్మకంగా మొదలైంది. ఎవరూ ఊహించని స్థాయిలో సక్సెస్ అయ్యింది. ముఖ్యంగా యాంకర్ అనసూయ భరద్వాజ్ అనతికాలంలో ఫేమ్ రాబట్టింది. అనసూయ గ్లామర్ కి జబర్దస్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. జబర్దస్త్ షోతో వచ్చిన ఫేమ్ తో అనసూయ యాంకర్ గా బిజీ అయ్యింది. జబర్దస్త్ కి అనసూయ(ANASUYA BHARADWAJ), ఎక్స్ట్రా జబర్దస్త్ కి రష్మీ గౌతమ్ యాంకర్స్ గా వ్యవహరించారు. దాదాపు 9 ఏళ్ళు జబర్దస్త్ లో కొనసాగిన అనసూయ 2022లో తప్పుకుంది. నటిగా బిజీ కావడం వలన, డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనసూయ వివరణ ఇచ్చింది.

జబర్దస్త్ నుండి బయటకు వచ్చేశాక పరోక్షంగా ఆరోపణలు చేయడం విశేషం. కమెడియన్స్ తనపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేసేవారని, మనం అసహనం ప్రదర్శించినా దాన్ని ఎడిటింగ్ లో లేపేసేవారని అన్నారు. అలాగే టీఆర్పీ స్టంట్స్ నచ్చకపోవడం కూడా ఒక కారణం అని అనసూయ చెప్పుకొచ్చింది. కాగా ఎట్టకేలకు అసలు రీజన్ బయటపెట్టింది. హైపర్ ఆది(HYPER AADI) వలనే జబర్దస్త్ వదిలేశానని ఓపెన్ కామెంట్స్ చేసింది. జబర్దస్త్ 12 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా సెలెబ్రేషన్స్ పేరుతో… రీ యూనియన్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు.

ఈ ఎపిసోడ్ కి గతంలో జబర్దస్త్ లో సందడి చేసిన పలువురు కమెడియన్స్ రీ ఎంట్రీ ఇచ్చారు. చివరికి నాగబాబు సైతం హాజరయ్యారు. అనసూయ ఈ ఎపిసోడ్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలవనవుంది. కాగా బుల్లితెర కమెడియన్ హైపర్ ఆది మీద తనకున్న అసహనాన్ని అనసూయ బయటపెట్టింది. పనిలో పనిగా హైపర్ ఆది మీద పంచులు వేసింది. ‘ఆది పొట్ట లోపలికి లాక్కో’ అని ఫస్ట్ ఒక పంచ్ వేసింది. వెళ్లే ముందు వద్దు ఆది వద్దు ఆది అని ఎంత బ్రతిమిలాడుకున్నాను. ఇంట్లో వాళ్లకు చెప్పేస్తాను అన్నాను. నాతో పాటు స్కిట్ చేసి, ఎంత ఎంకరేజ్ చేశాను. కానీ నా ఎక్స్క్లూజీవిటీ ఏడవలేదు, అది నా ఏడుపు.. అంటూ హైపర్ ఆది మీద అనసూయ ఫైర్ అయ్యింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com