Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hardik Pandya New Look: మొన్ననే కదా మొదలు పెట్టింది..అంతలోనే మొహం మొత్తిందా హార్దిక్ పాండ్యా

Hardik Pandya New Look: మొన్ననే కదా మొదలు పెట్టింది..అంతలోనే మొహం మొత్తిందా హార్దిక్ పాండ్యా

Oktelugu.com 2 weeks ago

Hardik Pandya New Look: టీమిండియా క్రికెట్లో విలక్షణమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు హార్థిక్ పాండ్యా. వేగంగా బౌలింగ్ వేస్తాడు. దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు.

మెరుపు వేగంతో ఫీల్డింగ్ చేస్తాడు. అందువల్లే అతడిని ఈ కాలపు ఆల్రౌండర్ అని పిలుస్తున్నారు.

ఆట ద్వారా ఎంతైతే సుపరిచితుడో.. మిగతా వ్యవహారాల ద్వారా కూడా అతడు అంతే.. మైదానంలో దూకుడుగా ఉంటాడు.. మైదానం వెలుపల కూడా అలానే ఉంటాడు.. అందువల్లే అతడికి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటుంటారు. గతంలో నటాషా అనే మోడల్ తో హార్దిక్ పాండ్యా ప్రేమ వ్యవహారం సాగించాడు. పెళ్లికి ముందే ఆమె గర్భవతి. ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక బాబు కూడా పుట్టాడు. అంతా బాగుంది అనుకుంటున్న క్రమంలో వీరిద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. అవి కాస్త విడాకులకు దారితీసాయి.

నటాషాకు విడాకులు ఇచ్చిన తర్వాత హార్థిక్ పాండ్యా మహికా శర్మ అనే అమ్మాయితో వ్యవహారం సాగిస్తున్నాడు. ప్రస్తుతం ఆమెతో కలిసి బెంగళూరులో ఉంటున్నాడు. ఇటీవల వరుసగా గాయాల బారిన పడుతున్న నేపథ్యంలో తన సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి హార్థిక్ పాండ్యా బెంగళూరులో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సులో చేరాడు. ఆ మధ్య టి20 వరల్డ్ కప్ జరిగినప్పుడు తెల్లటి జుట్టుతో కనిపించాడు హార్థిక్ పాండ్యా. అప్పట్లో మీడియా అటెన్షన్ మొత్తం తన వైపు ఉండేలాగా చూసుకున్నాడు.

ఇప్పుడు హార్దిక్ పాండ్యా సరికొత్త అవతారంలో కనిపించాడు. తన తెల్ల జుట్టును మొత్తం తొలగించుకొని గుండు బాస్ లాగా మారిపోయాడు.. మీసాలు.. గడ్డం మాత్రం అలానే ఉంచుకున్నాడు. తద్వారా హాలీవుడ్ సినిమాలో హీరో మాదిరిగా కనిపిస్తున్నాడు. స్టైలింగ్ విషయంలో హార్థిక్ పాండ్యా విపరీతంగా కేరింగ్ తీసుకుంటూ ఉంటాడు. ముఖ్యంగా తన జుట్టు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. అందువల్లే రకరకాల స్టైల్స్ ఫాలో అవుతూ ఉంటాడు. ఇప్పుడు తాజాగా గుండుతో కనిపించడంతో మీడియా దృష్టి మొత్తం హార్దిక్ పాండ్యా చుట్టూ తిరుగుతోంది. ఏది చేసినా కూడా సంచలనంగా ఉండాలి అనుకునే హార్దిక్ పాండ్యా.. ఇప్పుడు ఈ కొత్త స్టైల్ తో సోషల్ మీడియాను.. ప్రధాన మీడియాను షేక్ చేస్తున్నాడు. మీడియాను ఎప్పుడూ తన వైపు తిప్పుకోవాలో.. సోషల్ మీడియాను తన చేతిలో ఎప్పుడు ఉంచుకోవాలో హార్దిక్ పాండ్యాకు బాగా తెలుసని అతని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com