Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hariteja : 'బిగ్ బాస్' ఫేమ్ హరితేజ కి ఇంత పెద్ద కూతురు ఉందా.. ? ఎంత క్యూట్ గా ఉందో మీరే చూడండి..

Hariteja : 'బిగ్ బాస్' ఫేమ్ హరితేజ కి ఇంత పెద్ద కూతురు ఉందా.. ? ఎంత క్యూట్ గా ఉందో మీరే చూడండి..

Oktelugu.com 6 days ago

Hariteja : టీవీ సీరియల్స్ , ఎంటర్టైన్మెంట్ షోస్ , బిగ్ బాస్ రియాలిటీ షోస్ , సినిమాలతో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న నటి హరి తేజ. ముఖ్యంగా 'బిగ్ బాస్' రియాలిటీ షో ఈమె కెరీర్ లో గేమ్ చేంజర్ అనే చెప్పొచ్చు.

బిగ్ బాస్ సీజన్ 1 లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టి , టాప్ 3 స్థానం లో నిల్చిన ఈమె , ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. కెరీర్ పీక్ రేంజ్ లో వెళ్తున్న సమయం లోనే 'బిగ్ బాస్ 8' లో ఒక కంటెస్టెంట్ గా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చి , కేవలం నాలుగు వారాల్లోనే ఎలిమినేట్ అయ్యింది. మొదటి సీజన్ తో ఈమె ఎంత పాజిటివిటీ ని సంపాదించుకుందో , 8 వ సీజన్ తో అంతటి నెగెటివిటీ ని సంపాదించుకుంది.

అనవసరం గా రెండవసారి బిగ్ బాస్ లోకి వచ్చానని , ఎక్కడ లేని నెగెటివిటీ ని సంపాదించుకున్నాను అంటూ రీసెంట్ గా కూడా ఒక ఇంటర్వ్యూ లో చెప్తూ బాధ పడింది హరితేజ. ఇక ఆ తర్వాత అడపాదడపా టీవీ షోస్ లో కనిపిస్తూ వచ్చిన హరితేజ , ఎక్కువ శాతం సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఈమధ్య కాలం లోనే ఆమె అనేక సినిమాల్లో నటించింది. అయితే సోషల్ మీడియా లో హరి తేజ చాలా యాక్టీవ్ గా ఉంటూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తన వ్యక్తిగత విషయాల గురించి ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉంటుంది హరి తేజ. అంతే కాకుండా తనకు సంబంధించిన ఫోటోలను , వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఈమె కూతురికి సోషల్ మీడియా లో మంచి క్రేజ్ ఉంది.

'బిగ్ బాస్' హౌస్ లో ఉన్నప్పుడు కూడా తన కూతురిని ఎంతలా హరి తేజ మిస్ అయ్యిందో మనమంతా చూసాము. రీసెంట్ గా ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా తన కూతురు భూమి తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేసింది హరి తేజ. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ 'ఇల్లే ప్రపంచం అని కొందరు అంటుంటారు. కానీ ఇక నుండి కాదు , నీ నవ్వే నా ప్రపంచం. నేను ఈరోజు ఇంత సంతోషంగా , మానసిక ప్రశాంతత తో ఉన్నానంటే అందుకు కారణం నువ్వే.. నా భూమి తల్లి' అంటూ ఆమె చేసిన కామెంట్స్ నెటిజెన్స్ ని కదిలించాయి. సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న ఈ ఫోటోలను మీరు కూడా చూసేయండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com