Dailyhunt
హీరోలను హ్యాండిల్ చేయడంలో  గురువుకు తగ్గిన శిష్యులు అనిపించుకుంటున్న దర్శకులు...

హీరోలను హ్యాండిల్ చేయడంలో గురువుకు తగ్గిన శిష్యులు అనిపించుకుంటున్న దర్శకులు...

Oktelugu.com 2 weeks ago

Telugu Directors Handling Heroes: సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఒక సినిమాని నార్మల్ ఆడియన్స్ కి అర్థమయ్యే విధంగా చెప్పడమే కాకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడు వాళ్ళ సినిమాని చూసి అద్భుతంగా ఉందని ఫీల్ అయినప్పుడే ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది.

అలాగే ప్రేక్షకుడు మరోసారి ఆ దర్శకుడి సినిమాలు చూడడానికి ఇష్టపడుతుంటాడు. అతనికి స్టార్ హీరోల నుంచి అవకాశాలైతే వస్తుంటాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక హీరోతో ఎలాంటి సినిమా చేయాలి అతని ఫ్యాన్స్ అతని నుంచి ఏం కోరుకుంటున్నారు. ఎలాంటి కథలైతే వాళ్లకు బాగా సెట్ అవుతాయి అనేది ఒకటికి పది సార్లు చెక్ చేసుకొని మరి సినిమాను చేయాల్సిన అవసరమైతే ఉంటుంది. స్టార్ హీరోలు వాళ్ళ ఇమేజ్ కి తగ్గట్టుగా ఉన్న కథలను మాత్రమే ఎంచుకుంటారు. అందులో ఏమాత్రం ఇమేజ్ తగ్గే పరిస్థితి ఉంటే వాళ్ళు ఆ సినిమాలైతే చేయరు. ఇక ఇలాంటి సమయంలో దర్శకులు చాలా పెద్ద టాస్క్ ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న దర్శకులు స్టార్ హీరోల విషయంలో అప్పుడప్పుడు తప్పటడుగులు వేస్తుంటారు.

ఎందుకంటే హీరోలను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశ్యంతో కథ డిమాండ్ చేసిన కూడా కొన్ని సీన్స్ ని అప్పటికప్పుడు మార్చేస్తుంటారు. దీనివల్ల సినిమా మీద భారీ దెబ్బ పడే అవకాశాలైతే ఉంటాయి.కొంతమంది హీరోలు మాత్రమే దర్శకుడు ఏది చెబితే అది చేయడానికి సిద్ధమవుతుంటాడు. అలాంటి వారు అరుదుగా ఉంటారు.

ఇక ఏ హీరోతో అయినా తనను అనుకున్నది రాబట్టుకోగలిగే కెపాసిటీ ఉన్న దర్శకుడు సుకుమార్…ప్రస్తుతం అతని శిష్యులు సైతం వాళ్ళ సత్తా చాటాలనే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల లాంటి దర్శకుడు దసర సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. అలాగే ఇప్పుడు ప్యారడైజ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు.

తన సత్తా ఏంటో చాటుకున్న బుచ్చిబాబు సైతం ప్రస్తుతం పెద్ది సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ సక్సెస్ కొట్టడానికి సిద్ధమవుతున్నాడు… వీళ్ళిద్దరూ సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన వాళ్లే కావడం విశేషం…వీళ్ళనే కాకుండా మరి కొంతమంది స్టార్ డైరెక్టర్ల శిష్యులు సైతం ఇండస్ట్రీలో రాణించే ప్రయత్నం చేస్తున్నారు…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com