Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. హెచ్చరికలు జారీ !

ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. హెచ్చరికలు జారీ !

Oktelugu.com 4 days ago

Andhra Pradesh Heatwave: ఏపీ ఉడికిపోతోంది. ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు దాటుతున్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఒకటే పరిస్థితి. ఇంటి నుంచి బయటకు రాలేం.

ఇళ్లల్లో ఉండలేం అన్నట్టు ఉంది పరిస్థితి. సాయంత్రానికి గోడలు వేడెక్కిపోతున్నాయి. భానుడు ప్రచండుడిగా మారి నిప్పులు జరుగుతున్నాడు. బుధవారం పలనాడు జిల్లా పిడుగురాళ్లలో 47 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. 11 జిల్లాల్లో 204 మండలాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంతట ఒకేలా పరిస్థితి ఉంది. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అన్న తేడా లేకుండా అన్నిచోట్ల ఎండ తీవ్రత అధికంగా ఉంది. దీనికి తోడు వడగాలులు తోడవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
* ఉదయం 11 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని విధంగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. దీనికి తోడు తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. వడదెబ్బకు నిన్నను ఇద్దరు మృతి చెందారు. ప్రధానంగా పని ప్రదేశాల్లో ఉపాధి వేతన దారులు కుప్పకూలిపోతున్నారు.
* రాష్ట్రవ్యాప్తంగా 300 మండలాల్లో ఈరోజు తీవ్రవాడగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెబుతోంది.
* ప్రధానంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ, కృష్ణ, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో తీవ్రవాడగాలులు వీస్తాయి.
* శ్రీకాకుళం విజయనగరం తదితర ప్రాంతాల్లో 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్య అవకాశం ఉంది.
* ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రజలను హెచ్చరిస్తోంది. వేసవి సూచనలను చేస్తుంది. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇల్ల నుంచి బయటకు రావద్దని సూచిస్తుంది. మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com