Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇమ్రాన్ ఖాన్ తొలగింపు వెనుక అమెరికా.. వెలుగులోకి కుట్రకోణం

ఇమ్రాన్ ఖాన్ తొలగింపు వెనుక అమెరికా.. వెలుగులోకి కుట్రకోణం

Oktelugu.com 3 days ago

Imran Khan removal conspiracy: దేశాల మీద యుద్దాలు చేస్తుంది. అధ్యక్షులను అపహరిస్తుంది. చివరికి వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడదు. తన ప్రయోజనాల కోసం ఏమైనా చేస్తుంది.

ఎంతకైనా తెగిస్తుంది. సుంకాల విధింపు నుంచి మొదలు పెడితే ఎన్నో దారుణాల దాకా అమెరికా చేసే పనులు ఉపోద్ఘాతాలకు అందవు. అందుకే అమెరికాను అత్యంత సామ్రాజ్యవాద దేశమని అంటుంటారు. గిట్టని వాళ్లను కొట్టి.. దండుకోవడంలో అమెరికా తర్వాతే ఎవరైనా. తనకు నచ్చని పాలకుడు అధికారంలో ఉంటే..అతడిని గద్దె నుంచి దించే దాకా అమెరికా నిద్రపోదు.

మన పొరుగున ఉన్న పాకిస్థాన్ కు గతంతో క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా పని చేశాడు. కొన్ని సందర్భాల్లో భారత్ అంటే కొంతలో కొంత అభిమానం చూపించే వాడు. పాకిస్థాన్ సైన్యాధిపతి పెత్తనాన్ని, సైనికుల దుర్మార్గాలను అతడు ప్రశ్నించేవాడు. పరిపాలనలో సంస్కరణలు చేపట్టేవాడు. అతడి పాలనలో దుర్మార్గాలు అంతగా సాగకపోవడంతో కొందరు అతడిని పదవి నుంచి తొలగించేందుకు పావులు కదపడం మొదలు పెట్టారు. దీనికి అమెరికా కూడా సహకరించిందనే ఆరోపణలున్నాయి.

ఇమ్రాన్ ఖాన్ నుంచి పదవి నుంచి తొలగించేందుకు అమెరికా కుట్ర పన్నిందని ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా దౌత్య పత్రాలలీక్(సైఫర్ వివాదం) ఇటీవల వెలుగులోకి వచ్చింది. అమెరికా దౌత్యవేత్తగా పని చేసిన డొనాల్డ్ లూ, పాకిస్థాన్ రాయబారి మధ్య చర్చలు జరిగాయి. ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానం ఓడిపోవాలని, అతడు దిగిపోతేనే అమెరికా, పాకిస్థాన్ సంబంధాలు మెరుగుపడతాయని చర్చలు జరిగాయని విమర్శలు వినిపించాయి.

ఈ విమర్శలను అమెరికా తోసిపుచ్చింది. నాయకత్వ మార్పు విషయంలో తమకు సంబంధం లేదని అమెరికా స్పష్టం చేసింది. ఇదంతా కూడా పాకిస్థాన్ అంతర్గత వ్యవహారమని పేర్కొంది. అయితే ఇమ్రాన్ ఖాన్ పదవి కోల్పోవడానికి అమెరికానే కారణమని డ్రాస్ సైట్ అనే ఇన్వెస్టిగేటింగ్ న్యూస్ ఏజెన్సీ సైఫర్ అనే దౌత్య పత్రాన్ని వెలుగులోకి తెచ్చింది. దీనిని 'కేబుల్ ఐ 0678' గా గుర్తించింది. ఆరేళ్ల క్రితం అవిశ్వాసతీర్మానంలో ఓడిపోవడానికి కంటే ముందు వాషింగ్టన్ లో నాటి పాకిస్థాన్ రాయబారి అసద్ ముజీద్, అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి డొనాల్డ్ లూ కీలక చర్చలు జరిగినట్టు సమాచారం.

అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ తన పదవి పోవడానికి అమెరికానే కారణమని ఆరోపించారు. దీని వెనుక పాకిస్థాన్ ముస్లిం లీగ్ ఎన్, పాకిస్థాన్ పీపుల్స్ వంటిపార్టీలు ఉన్నాయని విమర్శించారు. చివరికి డ్రాప్ సైట్ ఈ విషయాన్ని బయటపెట్టడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com