Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IND vs NZ: ఎందులో చూడాలి.. భారత తుది జట్టులో ఛాన్స్ ఎవరికంటే..

IND vs NZ: ఎందులో చూడాలి.. భారత తుది జట్టులో ఛాన్స్ ఎవరికంటే..

Oktelugu.com 1 day ago

IND vs NZ:న్యూజిలాండ్ జట్టుతో భారత్ t20 సిరీస్ ఆడబోతోంది. అక్టోబర్ 22 నుంచి ఈ సిరీస్ మొదలవుతుంది. తొలి మ్యాచ్ క్రైస్ట్ చర్చ్ లో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ఈ మ్యాచ్ మొదలవుతుంది.

ఇటీవల స్వదేశంలో వెస్టిండీస్ జట్టుతో టి20 సిరీస్ ను సమం చేసుకున్న టీమ్ ఇండియా.. ఎలాగైనా సరే న్యూజిలాండ్ మీద t20 సిరీస్ గెలవాలని కృత నిశ్చయంతో ఉంది.

ఈ సిరీస్ మీద అందరి దృష్టి ఉంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు అసలైన పరీక్ష ఎదురు కాబోతున్న నేపథ్యంలో.. జట్టును అతడు ఎలా ముందుకు తీసుకెళ్తాడు.. న్యూజిలాండ్ కెప్టెన్ ఎత్తులకు ఎలాంటి పై ఎత్తులు వేస్తాడు అనేది ఆసక్తికరంగా కనిపిస్తోంది. అయితే ఈ సిరీస్లో భారత జట్టులో మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది.. ముఖ్యంగా నాలుగేళ్ల తర్వాత టి20 జట్టులోకి వచ్చాడు భువనేశ్వర్ కుమార్. న్యూజిలాండ్ మైదానాలు స్వింగ్ బౌలింగ్ కు అనుకూలంగా ఉంటాయి. పైగా భువనేశ్వర్ కుమార్ కు న్యూజిలాండ్ గడ్డమీద మెరుగైన రికార్డు ఉంది. భువనేశ్వర్ కుమార్ ట్రాక్ రికార్డును దృష్టిలో పెట్టుకొని అతడికి తుది జట్టులో చోటు కల్పించే అవకాశం ఉంది. ఆల్రౌండర్ల మధ్య సమతూకం కోసం తుది జట్టులో నమన్ దీర్ కు చోటు లభించే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల వెస్టిండీస్ జట్టుతో జరిగిన సిరీస్ లో ఇతడు ఆకట్టుకున్నాడు. ఇక ప్రిన్స్ యాదవ్ కు కూడా జట్టులో చోటు లభించే అవకాశం కనిపిస్తోంది. అదనపు పేసర్ ను ఆడించాలని యాజమాన్యం భావిస్తే ప్రిన్స్ కు చోటు లభించవచ్చు.. మిస్టీరియస్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి కూడా చోటు లభిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఇతడికి న్యూజిలాండ్ గడ్డమీద మంచి రికార్డు ఉంది. కాబట్టి ఇతడికి కూడా అవకాశం లభిస్తుందని సమాచారం.

మరోవైపు ఈ సిరీస్ ప్రసార హక్కులను సోని కంపెనీ దక్కించుకుంది. సోనీ స్పోర్ట్స్ లో .. సోనీ లీవ్ (ఓటిటి) లో ఈ మ్యాచ్ వీక్షించవచ్చు.

భారత టి20 జట్టు (అంచనా)

అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజు శాంసన్, వైభవ్ సూర్య వంశీ, తిలక్ వర్మ, కిషన్, అక్షర పటేల్, దూబే, నితీష్ కుమార్ రెడ్డి, నమన్ దీర్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, కులదీప్ యాదవ్.

న్యూజిలాండ్ గడ్డమీద పేస్ బౌలింగ్ కు సహకారం లభిస్తుంది. కాబట్టి భువనేశ్వర్ కుమార్ కు తుది జట్టులో చోటు లభించవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com