Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
IND vs NZ: న్యూజిలాండ్ భయపెట్టాలనుకుంది.. కానీ అక్కడే టీమిండియా మీసం మెలేసింది..

IND vs NZ: న్యూజిలాండ్ భయపెట్టాలనుకుంది.. కానీ అక్కడే టీమిండియా మీసం మెలేసింది..

Oktelugu.com 1 day ago

IND vs NZ:ఐదు టి 20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న తొలి మ్యాచ్లో టీమ్ ఇండియాకు అదిరిపోయే ఫలితం వచ్చింది. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన మ్యాచ్లో చివరికి టీమిండియానే మీసం మేలేసింది..

కివీస్ గడ్డమీద త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగరేసింది. టాస్ గెలిచిన టీమ్ ఇండియా బౌలింగ్ ఎంచుకొని అందరిని ఆశ్చర్యపరిచింది.

వాస్తవానికి ఈ మైదానం మీద పేస్ బౌలర్లు పండగ చేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. చాలాకాలం తర్వాత భువి జట్టులోకి వచ్చినప్పటికీ.. తన స్థాయి బౌలింగ్ వేయలేకపోయాడు..అర్ష్ దీప్ సింగ్ కూడా తన ప్రభావాన్ని చూపించలేకపోయాడు. భువనేశ్వర్ నుంచి మొదలు పెడితే నితీష్ వరకు అందరూ పరుగులు ఇవ్వడంలో పోటీపడ్డారు. అర్ష్ దీప్ సింగ్, మయాంక్ యాదవ్.. అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ సాధించారు. న్యూజిలాండ్ జట్టులో టిమ్ సిపెర్ట్ (24), అలెన్ (45), మిచల్ (28), ఫిలిప్స్ (82*), జాకోబ్స్ (31), బ్రేస్ వెల్ (7*) పరుగులు చేశారు. అదనంగా భారత్ బౌలర్లు 8 పరుగులు ఇచ్చారు. మొత్తంగా 20 ఓవర్లలో న్యూజిలాండ్ జట్టు నాలుగు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది.

226 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన టీమిండియా కు సంజు శాంసన్ (67), అభిషేక్ శర్మ (29) మెరుగైన ఆరంభాన్ని అందించారు. ఈ దశలో తిలక్ వర్మ (6), ఇషాన్ కిషన్ (1) అవుట్ కావడంతో జట్టు భారం మొత్తం కెప్టెన్ అయ్యర్ మీద పడింది. అతడు ఏకంగా 42 పరుగులు చేసి.. న్యూజిలాండ్ జట్టు మీద ఆశలు చల్లాడు. ఒక దశలో అతడు మ్యాచ్ ను గెలిపించే దిశగా అడుగులు వేశాడు. కానీ అతడు చివర్లో అవుట్ కావడంతో మ్యాచ్ ఉత్కంఠ గా మారింది. ఇదే క్రమంలో 24 పరుగులు చేసిన అక్షర్ కూడా అవుట్ కావడంతో మరింత ఒత్తిడి పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో నమన్ దీర్ అదరగొట్టాడు. 15 బాల్స్ ఎదుర్కొన్న అతడు ఐదు ఫోర్లు.. రెండు సిక్సర్ల సహాయంతో 42* పరుగులు చేశాడు.

అయ్యర్ అవుట్ అయినప్పటికీ.. అక్షర్ పటేల్ కీలక సమయంలో వెనక్కి వెళ్లిపోయినప్పటికీ.. దీర్ మాత్రం ధీరుడిలా బ్యాటింగ్ చేశాడు. తద్వారా టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం అందుకుంది. వాస్తవానికి ఒక దశలో టీమిండియా విజయానికి మూడు బంతుల్లో నాలుగు పరుగులు కావాలి. ఈ దశలో చివరివరకు మూడవ బంతికి హెన్రీ ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు. ఈ దశలో నమన్ క్రీజ్ లోకి చేరుకున్నాడు. హెన్రీ వేసిన బంతిని నేరుగా సిక్సర్ కొట్టాడు. తద్వారా టీమిండియా మీద ఉన్న ఒత్తిడి తగ్గించాడు. T20 మ్యాచ్ల సిరీస్ లో టీం ఇండియాకు తొలి విజయాన్ని అందించాడు. ఐపీఎల్ లో అదరగొట్టిన ఈ యంగ్ ప్లేయర్.. ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్ లో కూడా అదరగొట్టాడు. క్రితం వెస్టిండీస్ జట్టుతో జరిగిన సిరీస్ లోనూ సత్తా చూపించాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com