Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
India Pakistan Relations : ఇద్దరు భారతీయులకు పాకిస్తాన్‌ అత్యున్నత పురస్కారం.. ఎందుకో తెలుసా?

India Pakistan Relations : ఇద్దరు భారతీయులకు పాకిస్తాన్‌ అత్యున్నత పురస్కారం.. ఎందుకో తెలుసా?

Oktelugu.com 1 day ago

India Pakistan Relations : భారత్‌, పాకిస్తాన..1047 ముందు వరకు అఖండ భారత దేశంగా ఉండేవి. 200 ఏళ్ల బ్రిటిష్‌ పాలనపై ఉమ్మడిగా పోరాడాయి. అనేక పోరాటాల తర్వాత బ్రిటిష్‌ పాలకులు భారత్‌కు స్వాతంత్య్రం ఇచ్చారు.

1947, ఆగస్టు 15న స్వాతంత్య్రం ప్రకటించారు. ఇక్కడే అప్పటి ముస్లిం నేత మహ్మద్‌ అలీ జిల్లా విభజన ప్రక్రియకు తెరలేపారు. ముస్లింలకు ప్రత్యేక దేశం ఉండాలన్న ప్రతిపాదన తెచ్చారు. దీనికి పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, మహతా‍్మగాంధీ అంగీకరించారు. దీంతో భారత్‌ నుంచి పాకిస్తాన్‌ విడిపోయింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. కుట్రలు చేస్తోంది. ఉగ్రవాదులను ప్రోత్సహిస్తోంది. భారత్, పాకిస్తాన్ సంబంధాలు సాధారణంగా ఉద్రిక్తతలు, సరిహద్దు సమస్యలతోనే ముడిపడి ఉంటాయి. అయితే ఇటీవల ఒక విభిన్న ఘటన వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఇద్దరు భారతీయ పార్సీ వైద్యులకు తన అత్యున్నత పౌర పురస్కారాన్ని మరణానంతరం ప్రదానం చేయాలని నిర్ణయించింది.

జిన్నాకు వైద్యం..
1947 దేశ విభజనకు ముందు ముహమ్మద్ అలీ జిన్నాకు టీబీ సోకి ఉంది. ఆయన అప్పటికే బొంబాయిలో ఉండగా, స్థానిక పార్సీ వైద్యులైన డాక్టర్ జల్ రతన్‌జీ పటేల్, డాక్టర్ జల్ ధాయ్‌భో-కూ ఆయనకు చికిత్స అందించారు. 1946లో వారు ఎక్స్-రే పరీక్షల ద్వారా వ్యాధి తీవ్ర దశకు చేరుకున్నట్లు గుర్తించారు. జిన్నా మరో ఏడాది లేదా రెండేళ్లు మాత్రమే జీవించే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే జిన్నా కోరిక మేరకు వీరు ఆ విషయాన్ని పూర్తి గోప్యంగా ఉంచారు. కాంగ్రెస్ నాయకులకు గానీ, మహాత్మా గాంధీకి గానీ తెలుపలేదు. వృత్తి నిబద్ధతే దీనికి కారణం. దీని ఫలితంగా విభజన ప్రక్రియ ఎలాంటి అంతరాయం లేకుండా సాగింది. తరువాత బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటెన్ ఒకసారి జిన్నా ఆరోగ్యం గురించి ముందే తెలిసి ఉంటే విభజనను వాయిదా వేసేవాడినని విచారం ‍వ్యక్తం చేశారు. జిన్నా స్వాతంత్య్రం వచ్చిన ఏడాది తర్వాత 1948లో కన్నుమూశారు.

ఏడు దశాబ్దాల తర్వాత గుర్తింపు
పాకిస్తాన్ ఇప్పుడు పార్సీ వైద్యులైన డాక్టర్ జల్ రతన్‌జీ పటేల్, డాక్టర్ జల్ ధాయ్‌భో-కూ సేవను గుర్తించింది. నిషాన్-ఎ-ఇమ్తియాజ్ పురస్కారం ప్రకటించింది. వారిద్దరూ ఇప్పుడు లేకపోయినా, కుటుంబ సభ్యులకు మరణానంతరం అందజేస్తారు. ప్రణాళికా మంత్రి అహ్సాన్ ఇక్బాల్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. 2027 మార్చిలో అధికారికంగా ప్రదానం చేస్తారు.

భారతీయులు అంటేనే అంగ్గిమీద గుగ్గిలంలా ఎగిరిపడే పాకిస్తాన్‌.. స్వాతంత్య్రం వచ్చిన 80 ఏళ్ల తర్వాత పాకిస్తాన్‌ అత్యున్నత పురస్కారం ప్రకటించడం ఆశ్చర్యానికి గురిచేసింది. కేవలం తమ దేశ వ్యవస్థాపకుడు అయిన మహ్మద్‌ జిన్నాకు వైద్యం చేయడంతోపాటు ఆయన వ్యాధి గురించి దాచి దేశ విభజనకు సహకరించాని ఈ పురస్కారం ప్రకటించింది. మరి వైద్యుల కుటుంబాలు ఎక్కడ ఉన్నాయి. ఈ అవార్డు వారు స్వీకరిస్తారా.. తిరస్కరిస్తారా అనేది చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com