Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇంగ్లాండ్ చేతులారా... అక్కడే మ్యాచ్ టర్న్.. ఆస్ట్రేలియా సెవెంత్ వండర్ కు అదే కారణం

ఇంగ్లాండ్ చేతులారా... అక్కడే మ్యాచ్ టర్న్.. ఆస్ట్రేలియా సెవెంత్ వండర్ కు అదే కారణం

Oktelugu.com 6 days ago

Women's T20 World Cup 2026: వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్ లో ఇండియా చేతుల్లో ఓడిపోయింది. ఆ ఓటమి ఆస్ట్రేలియా జట్టును తీవ్రంగా ప్రభావితం చేసింది.

ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టు తన ఆట తీరు పూర్తిగా మార్చింది. ముఖ్యంగా ప్లేయర్ల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకుంది. ఆ ఫలితం కూడా ఇప్పుడు కనిపించింది.

మహిళల టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమేమి ఆవిష్కృతం కాలేదు. వన్డే వరల్డ్ కప్ లో టీం ఇండియా మాదిరిగా ఇంగ్లాండ్ జట్టు సొంత గడ్డమీద అద్భుత ప్రదర్శన చేయలేదు. ఆస్ట్రేలియా బౌలింగ్ ఎదుర్కోలేక ఇబ్బంది పడింది. భారీగా పరుగులు చేయక తడబడింది. ఒత్తిడిలో ఇంగ్లాండ్ ప్లేయర్లు చేతులెత్తేశారు. ఫలితంగా ఆస్ట్రేలియా ఎదుట 151 పరుగుల టార్గెట్ మాత్రమే విధించగలరు. ఈ పరుగులు ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద లెక్కలోవి కాదు. పైగా ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు భీకరమైన ఫామ్ లో ఉంది. ఈ లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించింది.

ఒక దశలో ఆస్ట్రేలియా ఓపెనర్ జార్జియా వోల్ (9) పరుగులకే అవుట్ అయింది. ఈ దశలో ఇంగ్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తే బాగుండేది. బెత్ మూనీ, లిచ్ ఫీల్డ్ అద్భుతం చేశారు. వీరిద్దరూ రెండో వికెట్ కు ఏకంగా 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టడంలో ఇంగ్లాండ్ బౌలర్లు విఫలమయ్యారు. కనీసం సొంత గ్రౌండ్ మీద సత్తా చూపించే విధంగా బౌలింగ్ వేయలేకపోయారు. లిచ్ ఫీల్డ్ (48) అవుట్ అయినప్పటికీ.. అప్పటికే ఆస్ట్రేలియాకు జరగాల్సిన లాభం జరిగిపోయింది. మూనీ మాత్రం మరో ఎండ్ లో రెచ్చిపోయింది. 64 పరుగులు చేసి అదరగొట్టింది.

ఆస్ట్రేలియా కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి.. అది కూడా 17.1 ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్ చేసింది. ఆస్ట్రేలియా జట్టుకు మొత్తంగా ఇది ఏడవ వరల్డ్ కప్ టైటిల్.. ఆస్ట్రేలియా జట్టుకు సమీపంలో ఏ జట్టు కూడా లేదు. ఒకరకంగా చెప్పాలంటే మహిళల క్రికెట్లో ఆస్ట్రేలియా ప్లేయర్లు ఏక ఛత్రాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, భారత్ ప్లేయర్లు ఈసారి ఆస్ట్రేలియాకు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. ఒకరకంగా ఈ టోర్నీలో ఆస్ట్రేలియా మహిళలు నల్లేరు మీద నడకలాగా తమ విజయప్రస్థానాన్ని కొనసాగించారు. చివరికి ఏడవ వరల్డ్ కప్ ట్రోఫీ అందుకుని సరికొత్త చరిత్ర సృష్టించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com