Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Irumudi Box Office Collection: జాం లో 'ఓజీ', 'సలార్', 'పెద్ది' రికార్డ్స్ ని దాటేసిన 'ఇరుముడి'.. ఎంత గ్రాస్ వచ్చిందంటే!

Irumudi Box Office Collection: జాం లో 'ఓజీ', 'సలార్', 'పెద్ది' రికార్డ్స్ ని దాటేసిన 'ఇరుముడి'.. ఎంత గ్రాస్ వచ్చిందంటే!

Oktelugu.com 1 week ago

Irumudi Box Office Collection: మాస్ మహారాజ రవితేజ నటించిన 'ఇరుముడి' చిత్రం రీసెంట్ గానే భారీ అంచనాల నడుమ విడుదలై ఎంతటి బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయినా, మహా అయితే వారం రెండు వారాలు మాత్రమే రన్ ఉంటుంది, అది కూడా వీకెండ్స్ లో మాత్రమే , ఆ తర్వాత రన్ ఉండదు అనే స్టేజి కి నిర్మాతలు , బయ్యర్స్ వచ్చారు. కానీ సరైన మంచి సినిమా తీస్తే, బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు నెలకొల్పవచ్చు అనేది ఈ చిత్రం ద్వారా రుజువు అయ్యింది. వరుసగా 6 డిజాస్టర్ ఫ్లాప్స్ ని అందుకొని , 10 కోట్ల మార్కెట్ రేంజ్ కి పడిపోయిన రవితేజ, ఏకంగా 200 కోట్ల గ్రాస్ ని కొల్లగొడుతాడని ఎవరైనా ఊహించారా?. కానీ నేటితో ఈ చిత్రం ప్రతిష్టాత్మక 200 కోట్ల గ్రాస్ మార్కుని అందుకోబోతుంది.

అంతే కాదు , నైజాం ప్రాంతం లో ఈ చిత్రం ఓజీ , పెద్ది, దేవర, సలార్ వంటి సూపర్ హిట్ చిత్రాల క్లోజింగ్ కలెక్షన్స్ ని ఈ వీకెండ్ ని దాటేయబోతుంది. కచ్చితంగా నైజాం ప్రాంతం లో ఈ చిత్రం 100 కోట్ల గ్రాస్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక ప్రాంతాల వారీగా 11 రోజుల్లో వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 46 కోట్ల 70 లక్షలు, సీడెడ్ నుండి 13 కోట్ల 55 లక్షలు , ఉత్తరాంధ్ర నుండి 10 కోట్ల 68 లక్షలు, ఈస్ట్ గోదావరి నుండి 6 కోట్ల 23 లక్షలు, వెస్ట్ గోదావరి నుండి 3 కోట్ల 72 లక్షలు, గుంటూరు నుండి 5 కోట్ల 32 లక్షలు, కృష్ణ నుండి 4 కోట్ల 92 లక్షలు, నెల్లూరు నుండి 2 కోట్ల 70 లక్షలు వచ్చాయి.

ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 93 కోట్ల 82 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 147 కోట్ల 75 లక్షల రూపాయిలు వచ్చినట్టు తెలుస్తోంది. అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 7 కోట్ల 88 లక్షలు రాగా, ఓవర్సీస్ నుండి 9 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా 110 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 187 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పటి వరకు బయ్యర్స్ కి వచ్చిన లాభాలు అక్షరాలా 90 కోట్ల రూపాయిలు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com