Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జపనీస్ వాకింగ్.. ఇలా చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా

జపనీస్ వాకింగ్.. ఇలా చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా

Oktelugu.com 1 week ago

Japanese walking method benefits: మనలో చాలామందికి ఉదయం పూట వాకింగ్ చేసే అలవాటు ఉంటుంది. సిటీలో ఉన్నవాళ్లు గ్రౌండ్లలో.. మారుమూల గ్రామాలలో ఉన్నవారు పంట పొలాలు లేదా..

ఇతర ప్రాంతాలలో వాకింగ్ చేస్తూ ఉంటారు. వాకింగ్ చేయడం వల్ల శారీరక సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. అంతేకాదు చెమట రూపంలో చెడు పదార్థాలు బయటికి వెళ్లిపోతుంటాయి. శరీరం స్లిమ్ అవుతూ ఉంటుంది. పైగా నడక వల్ల వృద్ధాప్య ఛాయలు రావు. శరీరంలో ఉన్న అనవసరమైన కొవ్వులు కూడా కరిగిపోతాయి. అవయవాల పనితీరు మెరుగవుతుంది.

వాకింగ్ చేసేటప్పుడు చాలామంది ఒక రకమైన విధానాన్ని పాటిస్తూ ఉంటారు. అయితే వాకింగ్ లు కూడా రకరకాల పద్ధతులు అమల్లోకి వచ్చాయి. అయితే ఇప్పటి కాలంలో జపనీస్ వాకింగ్ స్టైల్ ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. జపాన్ ప్రజలు పొదుపు.. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటారు.

జపాన్ ప్రజలు ప్రతిరోజు పదివేల అడుగుల వరకు నడుస్తూ ఉంటారు. దీనివల్ల శారీరక శ్రమ ఏర్పడుతూ ఉంటుంది. ఇది అత్యంత సులువైన శారీరక శ్రమకు బెంచ్ మార్క్ గా ఉంటుంది.. ఫిట్నెస్ ట్రాకర్స్ .. స్మార్ట్ ఫోన్ల సహాయంతో జపాన్ ప్రజలు ప్రతిరోజు 10,000 అడుగులు నడుస్తుంటారు.

ఇలా వాకింగ్ చేయడం వల్ల డిమెన్షియా నుంచి శరీరానికి రక్షణ కలుగుతుందని జపాన్ ప్రజలు నమ్ముతుంటారు. అయితే ఆరోగ్యంగా ఉన్న వారికి పదివేల అడుగుల దూరం నడవడం పెద్ద కష్టం కాకపోవచ్చు కానీ.. మోకాళ్ల నొప్పులు.. కీళ్ల నొప్పులు ఉన్నవారికి ఇబ్బంది తప్పకపోవచ్చు.. నడక వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయని జపాన్ ప్రజలు నమ్ముతుంటారు.. కొద్దిసేపు వేగంగా నడిచి.. ఆ తర్వాత నెమ్మదిగా నడవడం వల్ల శ్వాస మెరుగ్గా ఉంటుంది. అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తప్రసరణ వ్యవస్థని కూడా సక్రమంగా చేస్తోంది. జపాన్ ప్రజలు టెక్నాలజీని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నెమ్మదిగా నడుస్తుంటారు. ఆఫీస్ కు వెళ్తున్నప్పుడు వేగంగా అడుగులు వేస్తుంటారు.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకున్న తర్వాత కూడా జపాన్ ప్రజలు నడుస్తుంటారు. దీనివల్ల శరీరంలో జీర్ణక్రియ మెరుగవుతుందని.. సరైన స్థాయిలో పోషకాలు అన్ని శరీర అవయవాలకు లభిస్తాయని జపాన్ ప్రజలు నమ్ముతుంటారు. జపాన్ ప్రజలు ఉదయం పూట 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తుంటారు. ఒకవేళ ఆరోగ్యం మెరుగ్గా ఉన్నవారు అంతకంటే ఎక్కువగానే చేస్తుంటారు. ఇందులో మొదటి మూడు నిమిషాలు వేగంగా నడుస్తుంటారు. ఆ తర్వాత మూడు నిమిషాలు నెమ్మదిగా నడుస్తుంటారు. ఇలా ఐదుసార్లు వేగంగా.. ఐదుసార్లు నెమ్మదిగా నడిచి.. ఆరోగ్యానికి కాపాడుకుంటారు. అయితే ఇలా నడిచే మందు జపాన్ ప్రజలు వార్మప్ చేస్తుంటారు.

ఈ విధానం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని హార్వర్డ్ వైద్య నిపుణులు తమ పరిశోధన ద్వారా బయటపెట్టారు. రక్త ప్రసరణ వేగం దీనిద్వారా సమర్థవంతంగా జరుగుతుందని.. గుండెపోటు వచ్చే అవకాశం ఉండదని.. రోగ నిరోధక శక్తి పెరుగుతుందని.. రాత్రి సమయంలో నిద్ర మెరుగ్గా పడుతుందని హార్వర్డ్ వైద్యులు చెబుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com