Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కారులో కొబ్బరి బొండాం పెట్టడమే పాపం అయింది.. చూస్తుండగానే ఓ ప్రాణం..

కారులో కొబ్బరి బొండాం పెట్టడమే పాపం అయింది.. చూస్తుండగానే ఓ ప్రాణం..

Oktelugu.com 1 week ago

Car Accident: ప్రమాదం ఏ రూపంలో ముంచుకు వస్తుందో తెలియదు. ఏ విధంగా చంపేస్తుందో తెలియదు. చివరికి ఘోరం జరిగిపోయిన తర్వాత బాధపడి ఉపయోగము ఉండదు. ఇప్పుడు ఈ వ్యక్తి పరిస్థితి కూడా అలానే మారిపోయింది.

చూస్తుండగానే విగత జీవి గా మారిపోవడంతో కుటుంబ సభ్యులు కంటికి ధారగా విలపిస్తున్నారు.

రాజమండ్రికి చెందిన హరి ప్రసాద్ కు సంబంధించిన బంధువులు హైదరాబాదులో ఉంటున్నారు. ఆ బంధువుల అబ్బాయి వివాహం హైదరాబాదులో జరిగింది. వివాహానికి హాజరయ్యేందుకు హరి ప్రసాద్ హైదరాబాద్ వెళ్ళాడు. హైదరాబాదులో పెళ్లి చూసుకొని.. విజయవాడకు తిరుగు ప్రయాణమయ్యాడు. అతడు విజయవాడ వెళుతుండగా మధ్యలో తాగొచ్చని కొబ్బరి బొండాలను కొట్టించాడు. వాటిని కారులో పెట్టాడు. ఈ క్రమంలో కొబ్బరి బొండం జారీ క్లచ్, బ్రేక్ ఫెడల్స్ కింద ఇరుక్కుపోయింది. ఈ విషయం హరిప్రసాద్ గుర్తించలేదు. కొబ్బరి బొండం కారులో పెట్టి అతడు ఆ తర్వాత మర్చిపోయాడు. ఇంటికి వెళ్లే ఆత్రుతలో ఉండిపోయాడు.

కారు వేగంగా వెళ్తున్న క్రమంలో ఒక ట్రక్కు ఎదురుగా వచ్చింది. ఆ సమయంలో హరి ప్రసాద్ ద్ బ్రేక్ వేయడానికి ప్రయత్నించాడు. ఆ బ్రేక్ కింద కొబ్బరి బొండం ఇరుక్కుపోయింది. దీంతో బ్రేక్ వేసే అవకాశం లేకుండా పోయింది. కనీసం క్లచ్ కూడా పట్టుకుని సౌలభ్యం లేకపోయింది. బ్రేక్ పడకపోవడంతో హరిప్రసాద్ ట్రక్కును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో హరిప్రసాద్ అక్కడికక్కడే చనిపోయాడు. కొబ్బరి బోండాలు కనుక లేకపోతే హరిప్రసాద్ బతికేవాడు. ఈ సంఘటన వాహనదారులకు ఒక గుణపాఠం లాగా నిలుస్తోంది. డ్రైవింగ్ సీట్ దగ్గర ఎటువంటి వస్తువులు వాహనదారులు ఉంచుకోవద్దని ఈ సంఘటన నిరూపిస్తోంది.

హరిప్రసాద్ కొట్టించిన కొబ్బరి బోండాలు చిన్న పరిమాణంలో ఉన్నాయి. అధికారులు వెళ్తున్న వేగానికి బ్రేక్ మధ్యలో ఇరుక్కుపోయాయి. అందువల్లే హరి ప్రసాద్ కు బ్రేక్ వేసే అవకాశం లేకుండా పోయింది. కనీసం క్లచ్ పట్టుకునే సౌలభ్యం కూడా లేకపోయింది. ఫలితంగా హరిప్రసాద్ దుర్మరణం పాలు కావాల్సి వచ్చింది.. ట్రక్కును కారు వేగంగా ఢీకొట్టడంతో హరిప్రసాద్ తీవ్రగాయాల పాలయ్యాడు. రక్తస్రావం అధికంగా జరగడంతో అతడు సంఘటనా స్థలంలోనే చనిపోయాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com