Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కాస్త గ్యాప్ ఇవ్వండి సార్.. ఇలాగైతే మమతా బెనర్జీ బెంగాల్ వదిలి బంగ్లాదేశ్ వెళ్ళిపోతుంది..

కాస్త గ్యాప్ ఇవ్వండి సార్.. ఇలాగైతే మమతా బెనర్జీ బెంగాల్ వదిలి బంగ్లాదేశ్ వెళ్ళిపోతుంది..

Oktelugu.com 1 week ago

West Bengal Politics: గ్యాప్ ఏమాత్రం ఇవ్వడం లేదు.. కోలుకునే అవకాశం ఇవ్వడం లేదు. ప్రజలు బయటికి వస్తే గుడ్లతో దాడి చేస్తున్నారు. రాళ్లతో కొడుతున్నారు.

టీఎంసీ పార్టీ కార్యాలయాలకు తాళాలు వేస్తున్నారు. చోర్ చోర్ అంటూ నినాదాలు చేస్తున్నారు. అంతటితోనే ఆగడం లేదు బెంగాల్ వదిలి వెళ్ళిపోవాలంటూ చెబుతున్నారు. ఇదంతా బెంగాల్లో ప్రజల కోణంలో జరుగుతున్న వ్యవహారం.

భారతీయ జనతా పార్టీ కోణంలో చూస్తే అక్కడ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. ముఖ్యంగా మొదటి దాకా అధికార పక్షంలో ఉన్న టీఎంసీకి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతోంది. భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి విషయంలోనూ మమతా బెనర్జీకి చుక్కలు చూపిస్తున్నారు. ఇటీవల ఆమె పార్టీ నేత జహంగీర్ ఖాన్ ఎన్నికల్లో పోటీ చేయకుండా చేతులెత్తేశాడు. ఆర్థికపరమైన మోసాలు.. వివిధ రకాలైన కేసులలో ఆమె పార్టీ నాయకులు తీవ్రమైన అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఏకంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు విచారిస్తున్నాయి. కీలకమైన నాయకులను ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నగదు.. బంగారం.. ఇతర ఆస్తులను సీజ్ చేశారు.

ఆధార్ కార్డుల జారి.. ఓటర్ కార్డుల జారి.. బంగ్లాదేశ్ ప్రజలకు అందించిన పథకాలు.. పౌరసత్వం ఇలా అనేక విషయాలలో బిజెపి దూకుడుగా వెళ్తోంది. ఇప్పటికే చికెన్ నెక్ రహదారిని కేంద్రానికి అప్పగించింది బిజెపి. అదే కాదు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె ఏర్పాటు విషయంలో కూడా కేంద్రానికి సహకారం అందిస్తోంది. ఇక్కడితోనే బిజెపి ఆగిపోవడం లేదు. మమత పునాదులను తొలగించే పని చేపడుతోంది.

మమత అధికారంలో ఉన్నప్పుడు ఎవరినైతే తొక్కి పెట్టిందో.. వారితోనే ఇప్పుడు చెక్ పెట్టిస్తోంది బిజెపి. బెంగాల్ లో మమత బెనర్జీకి ఆమె సొంత పార్టీ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చే విధంగా బిజెపి నాయకులు రూపకల్పన చేశారు. ఇటీవల టీఎంసీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే రిత ప్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపాదిస్తూ ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు లెటర్ రాశారు. దీంతో బెనర్జీని ప్రతిపక్ష నాయకుడిగా నియమిస్తున్నట్టు స్పీకర్ వెల్లడించారు. అయితే ఇక్కడ రితప్రత బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీ తమ నాయకురాలని.. ఆమె ఏర్పాటు చేసిన పార్టీని చీల్చే ఉద్దేశం తనకు లేదని బెనర్జీ చెప్పడం ఇక్కడ విశేషం. ఈ నేపథ్యంలో బహిష్కృత నేతను ప్రతిపక్ష నేతగా మార్చిన నేపథ్యంలో.. త్వరలోనే మమతా బెనర్జీని బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ పంపిస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com