Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కల్కి 2' మూవీలో చేయడానికి సాయి పల్లవి డిమాండ్  చేసిన రెమ్యునరేషన్ ఎంతంటే...

కల్కి 2' మూవీలో చేయడానికి సాయి పల్లవి డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ ఎంతంటే...

Oktelugu.com 2 weeks ago

Sai Pallavi Kalki 2 remuneration: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కల్కి 2' సినిమా విషయంలో చాలా వరకు చర్చలైతే జరిగాయి. నిజానికి కల్కి మొదటి పార్ట్ లో కల్కి కి జన్మనిచ్చే క్యారెక్టర్ లో దీపికా పదుకొనే నటించింది… ఇక కల్కి మొదటి పార్టీ ఎండింగ్ వరకు కూడా తను ప్రెగ్నెంట్ లేడీ గానే కనిపించింది.

అయితే రెండో పార్ట్ కోసం ఆమె భారీగా కండిషన్స్ పెట్టడం వర్కింగ్ అవర్స్ లోనే తను వర్క్ చేస్తానని చెప్పడం. రెమ్యునరేషన్ పెంచడం లాంటివి చేసింది. దాంతో సినిమా యూనిట్ తనను మూవీ నుంచి తప్పించారు. మొత్తానికైతే దీపికా పదుకొనే ప్లేస్ లో ఎవరు నటిస్తారు ఆ ప్లేస్ ను భర్తీ చేయగలిగే నటి ఎవరు అంటూ గత కొన్ని రోజులుగా కొన్ని వార్తలైతే వచ్చాయి. ఎట్టకేలకు సాయి పల్లవి ఆ క్యారెక్టర్లో నటిస్తుంది అంటూ సినిమా యూనిట్ నుంచి న్యూస్ బయటకు వచ్చింది.

దాంతో ఇప్పుడు సాయి పల్లవి ఈ సినిమాలో నటిస్తున్నందుకుగాను ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ ఛార్జ్ చేస్తుందనే విషయాన్ని తెలుసుకోవడానికి చాలామంది తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. నిజానికి రన్బీర్ కపూర్ హీరోగా చేస్తున్న రామాయణంలో సాయి పల్లవి సీత క్యారెక్టర్ ను పోషిస్తుంది.

ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న నేపథ్యంలో కల్కి 2 కోసం కూడా తననే తీసుకుంటే బాగుంటుందని మేకర్స్ అనుకున్నారట… అందుకే వాళ్లు కూడా ఈ క్యారెక్టర్ కోసం దాదాపు 10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్నారట. ఇక ఏది ఏమైనా కూడా కల్కి 2 సినిమాకి ఇండియా వైడ్ గా భారీ క్రేజ్ ఉంది.

కాబట్టి సాయిపల్లవి అయితేనే దీపిక ప్లేస్ ను రీప్లేస్ చేయగలుగుతుందనే ఉద్దేశ్యంతో తనను ఏరీ కోరి మరి పెట్టుకున్నారు. ఇక మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ ని సాధించడంతో రెండో పార్ట్ కోసం ప్రతి ఒక్క ప్రేక్షకుడు విపరీతంగా ఎదురు చూస్తున్నాడు. ఇక ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రం ప్రభాస్ పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరో అయిపోతాడు. అలాగే సాయి పల్లవి సైతం టాప్ హీరోయిన్ గా మారిపోతుంది…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com