Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కల్కి 2 తర్వాత నాగ్ అశ్విన్ ఆ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడా..?

కల్కి 2 తర్వాత నాగ్ అశ్విన్ ఆ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడా..?

Oktelugu.com 5 days ago

Nag Ashwin next movie after Kalki 2: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో మన హీరోలు సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు.

పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేసే సినిమాలను చేయడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు… కల్కి సినిమాతో భారీ సక్సెస్ ని సాధించిన నాగ్ అశ్విన్ ప్రస్తుతం కల్కి 2 సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు..ప్రభాస్ కోసం ఎదురుచూస్తున్న నాగ అశ్విన్ ఈ గ్యాప్ లో మరో రెండు కథలను రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక కల్కి 2 తర్వాత ఆయన జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ‘డ్రాగన్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఈ క్రమంలోనే నాగ్ అశ్విన్ చెప్పిన కథకి ఎన్టీఆర్ ఎక్సైట్ అయ్యాడట.

మొత్తానికైతే నాగ్ అశ్విన్ తన తర్వాత సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ని ఎంచుకున్నాడు అంటే తప్పకుండ్ ఒక మంచి సబ్జెక్టుని రెడీ చేసి ఉంటాడు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. కల్కి సినిమాతో 1000 కోట్ల మార్క్ ను టచ్ చేసిన ఆయన ‘కల్కి 2’ సినిమాతో మరోసారి పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తానని చెబుతున్నాడు.

ఇప్పటికే ఆయన ఈ సినిమాతో 2000 కోట్ల మార్కును ఈజీగా దాటుతానని కామెంట్స్ చేస్తుండటం విశేషం…ఒకవేళ నాగ్ అశ్విన్ జూనియర్ ఎన్టీఆర్ తో కనుక సినిమా చేసినట్లయితే తను ‘కల్కి 2’ సినిమా పూర్తి చేసే లోపు జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాని కంప్లీట్ చేస్తాడు.

ఆ తర్వాత వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా తెరకెక్కే అవకాశాలు కూడా ఉన్నాయి…ఇక ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఎవరు చెప్పలేరు. ఒకరి కోసం రాసుకున్న కథలోకి మరొక హీరో వచ్చి సూపర్ సక్సెస్ ని సాధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. నాగ్ అశ్విన్ – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ సెట్ అవుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com