Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేంద్ర రాజకీయాల్లోకి చంద్రబాబు.. మళ్లీ మొదలు!

కేంద్ర రాజకీయాల్లోకి చంద్రబాబు.. మళ్లీ మొదలు!

Oktelugu.com 1 week ago

Chandrababu Naidu National Politics: ఏపీ సీఎం చంద్రబాబు ఇటీవల బిజీ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆయన ఇంటికి వెళ్లి చర్చించడం. తరువాత చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం..

కేంద్ర మంత్రులతో వరుసగా భేటీలు కావడం… ప్రత్యేకంగా హోం శాఖ మంత్రి అమిత్ షా తో చర్చించడం.. ఇవన్నీ చూస్తుంటే దేశంలో ఏదో రాజకీయ నిర్ణయం ఉంటుందన్న చర్చ నడుస్తోంది. ప్రధానంగా చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారు అన్న ప్రచారం పతాక స్థాయిలో జరుగుతోంది. అన్నింటికీ మించి ఆయన ఈ దేశానికి ఉప ప్రధాని కాబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభం అయింది. అనేక రకాల కథనాలు, గాసిప్స్ వస్తున్నాయి. అయితే మూడు నెలల కిందట ఇటువంటి ప్రచారం జరిగింది. బీహార్ సీఎం గా ఉన్న నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. త్వరలో ఆయన కేంద్ర మంత్రివర్గంలో చేరుతారన్న ప్రచారం నడుస్తోంది. అయితే అప్పట్లోనే సీఎం చంద్రబాబు తన పదవికి రాజీనామా చేసి ఈ దేశానికి ఉప ప్రధాని అవుతారన్న ప్రచారం నడిచింది.

* బిజెపి బాధిత పార్టీలన్నీ..
ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ పార్టీ కొద్దిపాటి బలం పెంచుకుంటుందన్న టాక్ వినిపిస్తోంది. భారతీయ జనతా పార్టీలో దెబ్బతిన్న విపక్షాలు ఇప్పుడు ఏకతాటిపైకి వస్తున్నాయి. దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ నేతలంతా బిజెపి పై కారాలు మిరియాలు నూరుతున్నారు. అయితే ఒక్కో రాష్ట్రం బిజెపి స్వాధీనం అవుతున్నా.. సార్వత్రిక ఎన్నికల విషయానికి వచ్చేసరికి ప్రజల మూడ్ మారే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ నేతలు ఏకతాటి పైకి వస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని బిజెపి పెద్దలు అంచనా వేస్తున్నారు. ఆ కూటమిలోకి చంద్రబాబు చేరితే అదనపు బలం అన్న అంచనాలు కూడా ఉన్నాయి. అందుకే జాతీయస్థాయిలో చంద్రబాబుకు ఉప ప్రధాని పదవి ఇచ్చి.. రాజకీయ మూడ్ మారకుండా… విపక్ష నేతలు బలం పెంచుకోకుండా ఉండేందుకు కేంద్ర పెద్దలు ఇలా ప్లాన్ చేసినట్లు ప్రచారం నడుస్తోంది.

* కుదిరే పనేనా?
అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లడం కుదిరే పని కాదు. ఆయన కేంద్ర రాజకీయాల్లోకి వెళితే సీఎం బాధ్యతలు లోకేష్ కు అప్పగిస్తారన్న ప్రచారం ఉంది. కానీ కూటమి ప్రభుత్వం నడుస్తున్న దృష్ట్యా రాజకీయంగా ఇది ఇబ్బందికర పరిణామం. ఎందుకంటే రాష్ట్రం ఇప్పుడిప్పుడే అభివృద్ధి పదాన నడుస్తోంది. అమరావతి రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు పనులు కూడా ఊపొందుకుంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లడం అనేది ఊహాజనితం అని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అనే ఒక అంశం పనిచేస్తూ ఉంటుంది. చూడాలి ఈ ప్రచారం ఎంతవరకు తీసుకెళ్తుందో..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com