Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Kotamreddy Sridhar Reddy: 'బోరు'గడ్డ.. కోటంరెడ్డి మాస్ కామెంట్స్!

Kotamreddy Sridhar Reddy: 'బోరు'గడ్డ.. కోటంరెడ్డి మాస్ కామెంట్స్!

Oktelugu.com 1 day ago

Kotamreddy Sridhar Reddy: రాజకీయాల్లో ఇష్టారాజ్యంగా రెచ్చిపోతామంటే కుదిరే పని కాదు. కొందరికి ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. తాజాగా బోరుగడ్డ అనిల్ కుమార్ పరిస్థితి అలానే ఉంది.

వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి ప్రత్యర్థులుగా ఉన్న వారిపై బోరుగడ్డ అనిల్ ఏ రేంజ్ లో విరుచుకుపడేవారో తెలియంది కాదు. మెగాస్టార్ కుటుంబం పై కూడా మాట్లాడారు. ఆ కుటుంబ మహిళలను కూడా కించపరిచారు. తనను తాను గొప్ప వైసీపీ వీర నాయకుడిని అని.. జగన్మోహన్ రెడ్డి సైనికుడిని అని చెప్పుకొచ్చేవారు. కానీ ఒక్కరోజు కూడా ఖండించలేదు ఆయన వ్యాఖ్యలను వైసిపి. కానీ ఇప్పుడు అదే బోరుగడ్డ అనిల్ కుమార్ కు వైసిపి కేంద్ర కార్యాలయంలోకి ప్రవేశం లేదు. దీంతో భార్యతో కలిసి కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగాల్సి వచ్చింది. అయితే ఈ సమయంలో ‘బోరు’గడ్డ అంటూ హాట్ కామెంట్స్ చేశారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

* అప్పట్లో బండికి కట్టి నడిపిస్తానని..
వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాధితుడే. 2019 ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. కానీ ఆ పార్టీ నాయకత్వాన్ని విభేదించడం ప్రారంభించారు. ఈ క్రమంలో 16 నెలల ముందుగానే వైసీపీతో కటీఫ్ చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు. ఈ క్రమంలో బోరుగడ్డ అనిల్ కుమార్ ప్రకటన చేయడమే కాదు.. నేరుగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కి ఫోన్ చేసి.. నిన్ను, నీ తమ్ముడిని బండికి కట్టి ఈడ్చుకుని పోతాను అంటూ హెచ్చరించారు. దానికి కోటంరెడ్డి కౌంటర్ కూడా ఇచ్చారు. ఇంత జరుగుతున్న అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో కనీసం స్పందించలేదు. వారించే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు అదే బోరుగడ్డ అదే వైసీపీ కేంద్ర కార్యాలయం ఎదుట బైఠాయించడాన్ని గుర్తు చేస్తూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎద్దేవా చేశారు.. బోరుగడ్డ.. జోరుగడ్డ.. ఆరోజు ఎగిరెగిరి పడ్డావు అంటూ ఎద్దేవా చేశారు. దేవుడు స్క్రిప్ట్ అంటూ వెనుకేసుకొచ్చారు అంటూ చెప్పుకొచ్చారు. అటువంటి వ్యక్తి ప్రస్తావన తెచ్చి తనను తాను తక్కువ చేసుకోనని బోరుగడ్డ ఈ ఎపిసోడ్ పై వ్యాఖ్యానించారు.

* చాలామందిది అదే పరిస్థితి..
అయితే ఒక్క బోరుగడ్డ మాత్రమే కాదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి.. అడ్డగోలుగా మాట్లాడిన చాలామంది పరిస్థితి ఇలానే ఉంది. ప్రధానంగా వారితో పార్టీకి డామేజ్ జరిగింది అనేది వైసిపి గుర్తించింది. అటువంటి వారిని దూరం పెట్టే క్రమంలో ఇటువంటి వివాదాలు వస్తున్నాయి. గతంలో బోరుగడ్డ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి విషయంలో మాత్రం చాలా దారుణంగా మాట్లాడారు. అప్పట్లో బోరుగడ్డను వారించే ప్రయత్నం చేయలేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఒక విధంగా ఇటువంటి ఘటనలతో నేతలు మరింత సీరియస్ గా వ్యవహరిస్తారు. కోటంరెడ్డి కూడా చేసింది అదే. నెల్లూరు జిల్లాలో అంతకుముందు రెండు ఎన్నికల్లో టిడిపి ప్రభావం చూపలేదు. కానీ 2019 ఎన్నికల్లో టిడిపి వార్ వన్ సైడ్ అన్నట్టు.. మొత్తం అన్ని స్థానాలను గెలుచుకుంది. అయితే ఇప్పుడు బోరుగడ్డ వ్యవహారం మాత్రం ఏపీ రాజకీయాల్లో సరికొత్త హాట్ టాపిక్ అవుతోంది. ఎన్నెన్నో అంశాలు బయటకు వస్తున్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com