Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కులం, మతం, రాజధాని.. ఏపీలో రాజకీయం!

కులం, మతం, రాజధాని.. ఏపీలో రాజకీయం!

Oktelugu.com 2 weeks ago

Andhra Pradesh Politics: ఇటీవల ఏపీలో జరుగుతున్న పరిణామాలు ఒక్కొక్కటి చూస్తే.. వాటి మధ్య సారూప్యత కనిపిస్తోంది. కుల రాజకీయాలు కనిపిస్తున్నాయి.

కుల సభలు పెరిగాయి. కులాల మధ్య, మతాల మధ్య విచ్చిన్నానికి ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సాయి కృష్ణ కేసు, గోదావరి జిల్లాలో కుల, మత వివాదాలు.. ఆపై జగన్మోహన్ రెడ్డి మావిగన్ స్పష్టత.. ఇలా వీటన్నింటికీ సారూప్యత ఉంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంపై బురద జల్లి.. వైసిపి రాజకీయ లబ్ది పొందే ఆరాటంగా కనిపిస్తోంది.

* వైసీపీ దూకుడు..
ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. గతం మాదిరిగా వ్యవహరిస్తోంది. ఒకవైపు కుల రాజకీయాలు, ఇంకోవైపు రాజధానిపై కుట్రలు, కొత్త ప్రతిపాదనలతో సిద్ధం అవుతోంది. కూటమి రెండేళ్ల పాలనపై ప్రజల్లో మాత్రం ఒక అభిప్రాయం ఉంది. అది ఎంత మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆమోదంగా లేదు. పైగా ప్రభుత్వ వైఫల్యాలపై కంటే.. తమ పాత రాజకీయాన్ని పదును పెడుతోంది. కాపుల అంశంతో పాటు ఇతర సామాజిక వర్గాల ద్వారా ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తోంది. కానీ ప్రజలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుకున్నంతగా రియాక్ట్ కావడం లేదు. దీంతో వైసీపీలో టెన్షన్ పెరుగుతోంది.

* సాయి కృష్ణ కేసు..
సాయి కృష్ణ కేసుకు సంబంధించి చాలా ఆశించింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఎంతలా అంటే గతంలో కాపు రిజర్వేషన్ ఉద్యమం లో లబ్ధి పొందే మాదిరిగా.. ఇదో టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందని ఆశించింది. అందుకే నేరుగా జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగారు. భారీ ఉద్యమానికి ప్లాన్ చేశారు. కానీ అదే సాయి కృష్ణకు నేరచరిత్ర ఉండడం.. చాలా తీవ్రమైన కేసులు నమోదు కావడం.. వైసిపి ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన యువకుడిగా కంటే.. తీవ్ర నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తిగా చూపడంతో కాపు రాజకీయం వర్కౌట్ కాలేదు.

* మత ప్రాతిపదికన..
రఘురామకృష్ణం రాజుకు వ్యతిరేకంగా.. కూటమి ప్రభుత్వంపై బురద చల్లేందుకు గోదావరి జిల్లాలో.. ఒక కులం మాటున.. మతం మాటున నిర్వహించిన సభ వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది అనేది బహిరంగ రహస్యం. ఏకంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు పై ఘోరంగా మాట్లాడారు. వారందరిపై ఇప్పుడు కేసులు నమోదయ్యాయి. అయితే పబ్లిక్ లో దీనిపై రియాక్ట్ వేరేలా ఉంది. అటువంటి వారిని అరెస్టు చేయాలన్న డిమాండ్ వచ్చిన తర్వాతనే పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మావిగన్ మాది అంటూ తేల్చి చెప్పారు. ఇలా వరుస పరిణామాలు చూస్తుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రజల్లో కన్ఫ్యూజన్ సృష్టించేందుకే ఈ గేమ్ ఆడుతోందని స్పష్టమవుతోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com