Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
LIC Policy : క్లెయిమ్ చేయని ఎల్ఐసి డబ్బు ఏమవుతుందో తెలుసా..

LIC Policy : క్లెయిమ్ చేయని ఎల్ఐసి డబ్బు ఏమవుతుందో తెలుసా..

Oktelugu.com 2 weeks ago

LIC Policy : మనదేశంలో అతిపెద్ద ప్రభుత్వంగా బీమా కంపెనీగా ఎల్ఐసి కొనసాగుతోంది. నేటి కాలంలో ప్రమాదాలు ఏ వైపు నుంచి వస్తున్నాయో తెలియడం లేదు. చావులు ఎలా సంభవిస్తున్నాయో అర్థం కావడం లేదు.

పైగా నేటి కాలంలో ఖర్చులు విపరీతంగా ఉంటున్నాయి.

అందువల్లే చాలామంది బీమా తీసుకుంటున్నారు. ఎల్ఐసి లో రకరకాల పాలసీలు తీసుకొని.. ప్రీమియం చెల్లిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఎల్ఐసిలో పాలసీ మెచ్యూరిటీ.. లేదా డెత్ క్లెయిమ్ లేదా సర్వైవల్ బెనిఫిట్స్ ఏడాది వరకు తీసుకోపోతే.. దానిని అన్ క్లెయిమ్డ్ మనీగా భావిస్తారు. అప్పుడు ఆ నగదు విషయంలో ఎల్ఐసి కీలక నిర్ణయం తీసుకుంటుంది. మధ్యలో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రవేశిస్తూ ఉంటుంది. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఆ నగదు మీద హక్కులను పొందుతాయి. ఆ తర్వాత నిబంధనల ప్రకారం నడుచుకుంటాయి.

ఎవరూ తీసుకోకుండా ఉన్న డబ్బులు..దాదాపు పది సంవత్సరాలు వరకు ఎల్ఐసి వద్ద ఉంటాయి. వడ్డీ కూడా ఎల్ఐసి ఇస్తుంది. 10 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్వహించే సీనియర్ సిటిజెన్ల సంక్షేమ నిధికి ఈ డబ్బులను బదిలీ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ పాలసీదారుడికి లేదా నామినీకి ఆ డబ్బు మీద హక్కులు ఉంటాయి. 25 సంవత్సరాలకు ఎప్పుడైనా సరే పాలసీదారులు లేదా వారి వారసులు ఈ నగదు కోసం వెళ్లొచ్చు. నగదు కావాలనుకునేవారు సరైన ధ్రువ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. పైగా అధికారులు విచారణ కు వచ్చినప్పుడు సహకరించాలి. అధికారులు అడిగిన ఇతరపత్రాలు కూడా ఇవ్వాల్సిఉంటుంది. అనేక రకాలుగా విచారణ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే ఎల్ఐసీ డబ్బులు ఖాతాలో జమ చేస్తుంది. ఏ ఆధారాలు కూడా సక్రమంగా లేకపోతే డబ్బులు ఇవ్వడానికి ఆసక్తి చూపించదు.

సాధారణంగా ఎల్ఐసి ఖాతాదారుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తుంది. డబ్బులు చెల్లించే విషయంలో ఏమాత్రం రాజీ పడదు. ఒకవేళ పాలసీలో ఏదైనా సమస్య ఉంటే.. లేదా ప్రీమియం చెల్లించే విషయంలో అడ్డంకులు ఏర్పడితే దానికి తగ్గట్టుగానే ఎల్ఐసి నిర్ణయం తీసుకుంటుంది. అంటే తప్ప కస్టమర్ల విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకోదు. పైగా కస్టమర్ చెల్లించిన ప్రతి రూపాయికి ప్రయోజనం లభించే విధంగా చూస్తూ ఉంటుంది. అందువల్లే ఎల్ఐసి మన దేశంలో అతిపెద్ద బీమా రంగ సంస్థగా వెలుగొందుతోంది.. లక్షల మంది భారతీయులకు ఆపన్న హస్తంగా నిలుస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com