Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mahesh Babu And SS Rajamouli: ఆ విషయం చెప్పి రాజమౌళి ని మహేష్ బాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా.

Mahesh Babu And SS Rajamouli: ఆ విషయం చెప్పి రాజమౌళి ని మహేష్ బాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా.

Oktelugu.com 2 weeks ago

Mahesh Babu And SS Rajamouli: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల క్రేజ్ ప్రత్యేకమైనది. యంగ్ హీరోలతో పోలిస్తే తమను తాము నిరూపించుకున్న స్టార్ హీరోల సినిమాలపైనే ప్రేక్షకులు..

దర్శకనిర్మాతలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. స్క్రీన్ పై వారు కనిపిస్తే వచ్చే ఆ ఎగ్జైట్‌మెంట్, ఆ కలెక్షన్స్ వేరు. ఈ క్రమంలోనే సూపర్‌స్టార్ మహేష్ బాబు ఇప్పుడు ప్రాంతీయ పరిధులను దాటి ‘పాన్ వరల్డ్’ స్థాయిలోకి అడుగుపెడుతున్నారు.

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను అలరించేందుకు మహేష్ బాబు సిద్ధమవుతున్నారు. తన కెరీర్‌లోనే ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రం కోసం ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు.

షూటింగ్ సెట్‌లో సరదా సన్నివేశం

ఇంతటి భారీ ప్రాజెక్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో, సెట్స్ నుండి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. మహేష్ బాబు దర్శకుడు రాజమౌళిని ఫన్నీగా ‘బ్లాక్‌మెయిల్’ చేస్తున్నారట.. షూటింగ్ సమయంలో తాను “ఇంటికి వెళ్తాను” అని చెప్పిన వెంటనే పంపించేయాలని.. అలా చేయకపోతే ‘వారణాసి’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొననని మహేష్ సరదాగా షరతు విధించారట. దీనికి రాజమౌళి కూడా నవ్వుతూనే బదులిచ్చారట. “మీరు ప్రమోషన్స్‌కు రాకపోయినా పర్లేదు కానీ.. మిమ్మల్ని త్వరగా పంపించేసి సినిమాను సరిగ్గా తీయకపోతే… చివరికి మీ అభిమానులే నన్ను తిడతారు” అని నవ్వుతూ సమాధానమిచ్చారట.

భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ అంతర్జాతీయ ప్రాజెక్ట్ సెట్స్‌లో రాజమౌళి, మహేష్ బాబుల మధ్య ఉన్న ఈ బాండింగ్, సరదా సంభాషణలు ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ వైరల్ అవుతున్నాయి…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com