Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మహిళలకు గొప్ప శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి

మహిళలకు గొప్ప శుభవార్త చెప్పిన రేవంత్ రెడ్డి

Oktelugu.com 2 days ago

CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం మహిళలకు గొప్ప శుభవార్త చెప్పింది. అంతేకాదు త్వరలోనే ఇది అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దీంతో ఆశావాహుల్లో సందడి నెలకొంది.

అయితే ప్రభుత్వం చెప్పిన గుడ్ న్యూస్ నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించింది కాదు.. మహిళ రుణాలకు సంబంధించింది అంతకంటే కాదు..

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే మహిళలకు మహాలక్ష్మి.. వడ్డీ లేని రుణాలు.. ఇతర సదుపాయాలను కల్పిస్తోంది. తాజాగా మహిళల విషయంలో మరొక అడుగు ముందుకేసింది. ముఖ్యంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమైంది.. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ మహిళలకు శుభవార్త చెప్పింది. అంగన్వాడి కేంద్రాలలో ఖాళీగా ఉన్న 15,982 పోస్టులను ఈ ఏడాదిలోగా భర్తీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ నియామక ప్రక్రియ జరుగుతుంది. త్వరలోనే జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో హెల్పర్ పోస్ట్లు 12,882 ఉన్నాయి. టీచర్ పోస్టులు మూడువేల ఒక వంద వరకు ఉన్నాయి. హెల్పర్ పోస్ట్ లకు 10.. టీచర్ ఉద్యోగాలకు ఇంటర్ విద్యను కనీస ఉత్తీర్ణతగా నిర్ణయించారు.

స్త్రీ శిశు సంక్షేమ శాఖలో కొన్నాళ్లుగా పోస్టుల భర్తీ ప్రక్రియ ఆగిపోయింది. ఈ నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు దారుణంగా మారింది. ప్రభుత్వం కొంతకాలంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖను ప్రక్షాళన చేస్తోంది. ఇందులో భాగంగా అంగన్వాడికి భాగంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్థిక శాఖ కూడా దీనికి ఆమోదం తెలిపింది. దీంతో త్వరలోనే ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ జరుగుతుందని తెలుస్తోంది. కలెక్టర్ ఆధ్వర్యంలోనే నియామక ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది.. ఆ తర్వాత వెంటనే కొత్త ఉద్యోగులు విధుల్లో చేరుతారు. పైగా జనాభా పెరిగిన నేపథ్యంలో చాలావరకు కొత్త అంగన్వాడీ సెంటర్లను ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కొత్త గ్రామపంచాయతీలు ఏర్పడిన నేపథ్యంలో.. వాటికి తగ్గట్టుగా అంగన్వాడి కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

అంగన్వాడి కేంద్రాల్లో చిన్నపిల్లలకు ఇప్పటికే ప్రభుత్వం పౌష్టికాహారం అందిస్తోంది. కేంద్రం సహకారంతో చిన్నపిల్లలకు గుడ్లు.. ఇతర బలవర్ధకమైన ఆహార పదార్థాలను సరఫరా చేస్తోంది. గర్భిణులకు కూడా పాలు.. గుడ్లు.. కందిపప్పు.. అందజేస్తోంది..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com