Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
మిత్రులమని బిజెపి, వైసిపి ప్రకటించగలవా?

మిత్రులమని బిజెపి, వైసిపి ప్రకటించగలవా?

Oktelugu.com 3 days ago

BJP And YSRCP: ఏపీలో రాజకీయ రచ్చ సాగుతోంది. జగన్ మనకు శాశ్వత మిత్రుడు అని పవన్ కళ్యాణ్ తో అమిత్ షా అన్నట్టు ప్రముఖ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు.

జగన్మోహన్ రెడ్డిని జైలులో పెట్టాలన్న పవన్ కళ్యాణ్ కోరినట్లు.. దానిపై అమిత్ షా క్లాస్ పీకినట్లు విశ్లేషించారు నాగేశ్వర్. చంద్రబాబు కోరికతోనే పవన్ అక్కడికి వెళ్లినట్టు అర్థం వచ్చేలా మాట్లాడారు. అయితే ఈ విషయాలను పక్కన పెట్టేద్దాం. జగన్ శాశ్వత మిత్రుడు అయితే బిజెపి ఆయనతో కలవగలదా? పోనీ జగన్మోహన్ రెడ్డి తాను బిజెపితో కలుస్తానని బాహటంగా చెప్పగలరా? ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి అని బాహటంగా వారు ప్రకటించగలరా? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. పూర్తి వ్యతిరేక భావజాలం కలిగిన రెండు పార్టీలు శాశ్వత మిత్రులుగా కొనసాగ గలవా?

* కాంగ్రెస్ బద్ధ విరోధిగా..
భారతీయ జనతా పార్టీ కి జగన్ మోహన్ రెడ్డి ఒక విషయంలో మాత్రం అనుకూలం. కాంగ్రెస్ పార్టీకి బిజెపి బద్ద విరోధి. అదే కాంగ్రెస్ పార్టీని బద్ధ విరోధిగా చూస్తారు జగన్మోహన్ రెడ్డి. ఈ విషయంలో మాత్రం ఆ రెండు పార్టీలు విధానం ఒకటే. కానీ భావజాలం మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది, కాంగ్రెస్ పార్టీది ఒక్కటే. కాంగ్రెస్ నాయకులే 90 శాతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉండే ముస్లిం, మైనారిటీలు, ఎస్సీ ఎస్టీలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి టర్నయ్యారు. ఈ వర్గాలంతా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకం. ఇలాంటి విరుద్ధ భావజాలం కలిగిన ఆ రెండు పార్టీలు కలవగలవా? కలిసి నడవగలవా? ఈ విషయం ప్రొఫెసర్ నాగేశ్వర్ కు తెలియదా? ఆయనకు ఈ చిన్నపాటి అవగాహన లేదా? అనేది ఇప్పుడు చర్చ. కచ్చితంగా ఇది రాజకీయ ప్రేరేపిత విశ్లేషణ అంటూ ఒక ప్రచారం నడుస్తోంది.

* వ్యతిరేక భావజాలం..
బలమైన హిందుత్వవాదంతో ముందుకు వెళుతోంది భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీతో సుదీర్ఘ ప్రయాణం కొనసాగిస్తూ వస్తోంది తెలుగుదేశం పార్టీ. రాజకీయ కారణాలతో బీజేపీ నుంచి బయటకు వచ్చిందే కానీ.. ఆ రెండు పార్టీల కలయిక ప్రతిసారి మంచి విజయాన్ని నమోదు చేస్తూ వచ్చింది. అటువంటి పార్టీని వదులుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో బిజెపి ఎందుకు కలుస్తుంది. పోనీ కలిస్తే ఏమైనా ప్రయోజనం ఉందా అంటే అది లేదు. మూడోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చేందుకు కారణం తెలుగుదేశం. అటువంటి పార్టీని తాత్కాలిక మిత్రుడిగా అమిత్ షా ఎందుకు పోలుస్తారు. పైగా జగన్ పట్ల విపరీతమైన ద్వేషంతో నడిచే పవన్ కళ్యాణ్ వద్ద ఎందుకు ప్రస్తావిస్తారు. చంద్రబాబు నాయకత్వాన్ని బలంగా నమ్ముతున్నారు పవన్ కళ్యాణ్. కేంద్ర ప్రభుత్వ మద్దతుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని భావిస్తున్నారు. ఆయన రాజకీయాలు ఒక పద్ధతి ప్రకారం ఉంటాయి. ఆయనెందుకు జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెట్టమని కోరుతారు? ప్రొఫెసర్ నాగేశ్వర్ ది ముమ్మాటికి రాజకీయ ప్రేరేపిత విశ్లేషణ అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. కూటమిలో ఒక రకమైన విచ్చిన్నం కోసం చేసే ప్రయత్నం గా ఎక్కువమంది భావిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com