Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mohanlal daughter : హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మోహన్ లాల్ కూతురు.. ఈ రేంజ్ లో ఉందేంటి..

Mohanlal daughter : హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మోహన్ లాల్ కూతురు.. ఈ రేంజ్ లో ఉందేంటి..

Oktelugu.com 4 days ago

Mohanlal daughter : మలయాళం ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా , సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్ గా పేరొందిన హీరోల్లో ఒకరు మోహన్ లాల్.

మలయాళం లాంటి చిన్న ఇండస్ట్రీ లో 300 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టాడంటే మోహన్ లాల్ ఏ రేంజ్ సూపర్ స్టార్ అనేది అర్థం చేసుకోవచ్చు. అయితే ఆయన కొడుకు ప్రణవ్ మాత్రం ఆ స్థాయికి ఇంకా చేరుకోలేదు. ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా ఏళ్ళు అయ్యింది , కేవలం ఒక్క సూపర్ హిట్ ని మాత్రమే అందుకున్నాడు. మమ్మూటీ కొడుకు దుల్కర్ సల్మాన్ లాగా మలయాళం ఇండస్ట్రీ లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోలేకపోయాడు ప్రణవ్. కానీ భవిష్యత్తులో రెండు మూడు హిట్లు అందుకుంటే ఈయన ఇండస్ట్రీ లో స్థిరమైన మార్కెట్ ని సొంతం చేసుకోవచ్చు. అయితే మోహన్ లాల్ కి విస్మయ అనే కూతురు ఉంది.

ఈమె కూడా హీరోయిన్ గా ఒక సినిమా చేసింది. ఆ సినిమా పేరు ‘తుదక్కం’. ఈ శుక్రవారం భారీ అంచనాల నడుమ విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రం లో మోహన్ లాల్ కూడా కీలక పాత్ర పోషించారు. అయితే ప్రస్తుతానికి ఈ సినిమా మలయాళం వెర్షన్ లో మాత్రమే విడుదల కాబోతుంది. తెలుగు వెర్షన్ కూడా విడుదల అవుతుంది కానీ , అందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇకపోతే మలయాళం లో క్రైమ్ థ్రిల్లర్ జానర్ సినిమాలను అక్కడి ఆడియన్స్ బాగా చూస్తుంటారు. అందుకే విస్మయ కూడా క్రైమ్ థ్రిల్లర్ జానర్ తోనే ఇండస్ట్రీ కి పరిచయం కాబోతుంది. ట్రైలర్ ని చూస్తుంటే మోహన్ లాల్ క్లాసిక్ ‘దృశ్యం’ షేడ్స్ కూడా చాలానే కనిపించాయి.

కథ ఏమిటంటే ఒక హిల్ స్టేషన్ కి చదువు , ఉద్యోగం కోసం ఒక చిన్న కుటుంబం వలస వెళ్తుంది. ఆ ప్రాంతం రాత్రి అయితే చాలు ఆగంతకులు రోడ్ల మీద చొరబడి అనూహ్యమైన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంటారు. వాళ్ళ కారణం గా ఈ చిన్న కుటుంబం అనేక ఇబ్బందులకు గురి అవుతుంది. ఆ తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా , అనేక ట్విస్టులు జోడించి ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ని తెరకెక్కించారు. ఇక విస్మయ విషయానికి వస్తే ఈమె రెగ్యులర్ హీరోయిన్ లాగా కాకుండా లుక్స్ పరంగా చాలా బొద్దుగా కనిపిస్తోంది. అచ్చు గుద్దినట్టు తండ్రి పోలికలతో పుట్టిన ఈ అమ్మాయి మొదటి సినిమాతోనే ఆకట్టుకునేలా ఉందని ట్రైలర్ ని చూస్తుంటే అర్థం అవుతోంది. ఈ ట్రైలర్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com