Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ ఫోటోలు వాడుకుంటే ఇక జైలుకే.. యువత తస్మాత్ జాగ్రత్త..

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ ఫోటోలు వాడుకుంటే ఇక జైలుకే.. యువత తస్మాత్ జాగ్రత్త..

Oktelugu.com 3 days ago

Mrunal Thakur: ఈమధ్య కాలం లో సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టే కొన్ని ఫోటోలు , వీడియోలు చూసి , అసలు ఇవి నిజమైనవా?, లేదా AI ద్వారా క్రియేట్ చేయబడిందా అనేది అర్థం అవ్వని పరిస్థితి ఏర్పడింది.

ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీలు AI కారణంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదురుకుంటున్నారు. కొంతమంది ఆకతాయిలు సెలబ్రిటీలకు సంబంధించిన కొన్ని ఫోటోలను తీసుకొని , వాటిని AI ద్వారా మార్ఫ్ చేసి సోషల్ మీడియా లో తిప్పుతున్నారు. వాటిని అభిమానులు నిజమేనని అనుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. దీంతో సదరు సినీ సెలబ్రిటీలు అవి నిజం కాదు, AI ద్వారా క్రియేట్ చేయబడింది అంటూ క్లారిటీ ఇచ్చే పరిస్థితులు చాలానే ఏర్పడ్డాయి. ముఖ్యంగా హీరోయిన్స్ అయితే ఇలాంటి AI క్రియేటెడ్ వీడియోస్ ద్వారా మానసిక వేదన అనుభవిస్తున్నారు. అలాంటి హీరోయిన్స్ జాబితాలో ఇప్పుడు మృణాల్ ఠాకూర్ కూడా చేరిపోయింది.

రీసెంట్ గానే ఈమెకు సంబంధించి కొన్ని డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. వీటిపై మృణాల్ ఠాకూర్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ‘అనుమతి లేకుండా ఇతరుల ఫోటోలను వాడుకొని AI ద్వారా ఫేక్ వీడియోస్ చేయడం చట్టరీత్యా నేరం. ఇలాంటి పనులు చేసేవాళ్ళని అసలు క్షమించకూడదు. ఇలాంటి పనులు చేసేవాళ్లకు ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను. ఇకపై నా మీద డీప్ ఫేక్ వీడియోలు చేస్తే కఠినమైన లీగల్ యాక్షన్స్ తీసుకుంటాను’ అంటూ హెచ్చరించింది. ఇప్పుడు ఇది ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. గతం లో ప్రముఖ హీరోయిన్ రష్మిక కి సంబంధించిన ఒక డీప్ ఫేక్ వీడియో బాగా వైరల్ అవ్వడం , ఆమె వెంటనే స్పందించడం వంటివి జరిగిన సంగతి తెలిసిందే. నాకే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అంటే , ఇక సామాన్య స్త్రీల పరిస్థితి ఏంటి?, ఊహిస్తేనే చాలా భయంకరంగా ఉంది అంటూ రష్మిక ఆరోజుల్లో చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి.

ఆమె మాటలు అందరినీ ఆలోచింపజేశాయి. అయితే AI మీద నియంత్రణ తీసుకొని రావాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నాయి. దేశం లో ఆకతాయిల సంఖ్య భారీగానే ఉంటుంది. ఎంతమందికి అని వార్నింగ్స్ తో ఆపగలరు చెప్పండి?, అందుకే ఆడవాళ్ళ సేఫ్టీ కోసం , AI ని నియంత్రిస్తూ కఠినమైన చట్టం తీసుకొని రావాలని అంటున్నారు నెటిజెన్స్. చాలా రోజుల నుండి ఈ డిమాండ్ ఉంది , సినీ సెలబ్రిటీలు హై కోర్టుకి వెళ్లి , వ్యక్తిగత సమాచారం విషయం లో భద్రతా కల్పించాలని కోరుతున్నారు , వాళ్లకు హై కోర్టు భద్రతా కూడా కల్పించింది. అయినప్పటికీ ఇలాంటి డీప్ ఫేక్ వీడియోస్ ఆగడం లేదంటే , కచ్చితంగా ఆలోచించాల్సిన సీరియస్ విషయమే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com