Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నాగార్జున 100 వ సినిమా లో టబు చేసే పాత్ర ఏంటంటే..?

నాగార్జున 100 వ సినిమా లో టబు చేసే పాత్ర ఏంటంటే..?

Oktelugu.com 0 months ago

Nagarjuna 100th Movie: హీరోల్లో నాగార్జునకు చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకప్పుడు ఆయన నుంచి వచ్చిన సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.

క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని రకాల పాత్రలు చేయగలిగే కెపాసిటి నాగార్జున సొంతం. అలాంటి నాగార్జున తన వందో సినిమాను చాలా ప్రెస్టేజీయస్ గా తీసుకొని మరి చేస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయినప్పటికి ఇందులో ఐశ్వర్య రాజేష్ టబు లు కూడా నటిస్తున్నారు. ముఖ్యంగా నాగార్జునతో చాలా సంవత్సరాల తర్వాత టబు నటించడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో నాగార్జున ఎంగేజ్ లో ఉన్నప్పుడు టబు తన లవర్ గా కనిపిస్తుందట. అయితే ఇందులో నాగార్జున డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ మూవీ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట.

మొత్తానికైతే టబు ఈ మధ్యకాలంలో తెలుగులో పెద్దగా సినిమాలైతే చేయడం లేదు. అలా వైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్ తల్లిగా నటించిన ఆమె ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తుంది. ఇక ఇప్పటికే ఆమె నుంచి వచ్చిన ప్రతి సినిమా డిఫరెంట్ అటెంప్ట్ గా మిగులుతుంది.

కాబట్టి ఈ సినిమాలో తన పాత్ర కూడా చాలా వేరియేషన్స్ ఉండడమే కాకుండా ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ ని కూడా ప్రేక్షకుడికి ఇస్తుందని ఆయన క్యారెక్టర్ ఈ సినిమా మొత్తానికి చాలా కీలకమని చెబుతున్నారు… ఇక ఏది ఏమైనా కూడా దర్శకుడు ఈ సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక నాగార్జున వందో సినిమాతో భారీ విజయాన్ని సాధించాల్సిన అవసరమైతే ఉంది.

ఆయన గత సంవత్సరం చేసిన కుబేర, కూలీ లాంటి సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించాడు. ఆ పాత్రలు ఆయనకి మంచి గుర్తింపుని తీసుకొచ్చాయి. తన 100 వ సినిమాతో మరోసారి తన సత్తా చాటుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com