Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నాని మార్కెట్ ను బీట్ చేయాలని చూస్తున్న అఖిల్...దాని కోసం మాస్టర్ ప్లాన్ వేశాడుగా...

నాని మార్కెట్ ను బీట్ చేయాలని చూస్తున్న అఖిల్...దాని కోసం మాస్టర్ ప్లాన్ వేశాడుగా...

Oktelugu.com 6 days ago

Akhil vs Nani: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి క్రియేట్ చేసుకున్న నటులలో నాని ఒకరు… ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుంది.

ఇప్పుడు ఆయన మాస్ హీరోగా మారడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకుముందు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేసిన దసర సినిమాతో లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఆయన ప్యారడైజ్ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇదిలా ఉంటే అక్కినేని ఫ్యామిలీ మూడో తరం నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ప్రస్తుతం ఒక్క సక్సెస్ ని సాధించడానికి నానా తంటాలు పడుతున్నాడు. ప్రస్తుతం ‘లెనిన్’ సినిమాతో ఈవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను రాబడుతుందా? లేదా అనేది కీలకంగా మారింది…

మొత్తానికైతే నానిని బీట్ చేసి అతని మార్కెట్ ని కబ్జా చేయాలని అఖిల్ చూస్తున్నాడు. ప్రస్తుతం నానికి 100 కోట్లకు పైన మార్కెట్ ఉంది. అఖిల్ కి 30 కోట్ల మార్కెట్ కూడా లేదు. మరి ఇలాంటి క్రమంలో ఆయన నాని ని బీట్ చేయడం సాధ్యమవుతుందా? లెనిన్ సినిమా బ్లాక్ బస్టర్ అయితే తప్ప 100 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టే అవకాశాలైతే లేవు.

మరి ఇలాంటి క్రమంలో అఖిల్ ఈ మూవీ తో ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తాడు. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ సంపాదించుకోగలిగే కెపాసిటి అఖిల్ కి ఉందా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… మొత్తానికైతే నాని మాస్ హీరోగా మారుతున్నాడు. కాబట్టి అఖిల్ తన మార్కెట్ ను బీట్ చేయగలిగితే నాని కంటే పెద్ద హీరో అయిపోవచ్చు అనే ధోరణిలో ఆలోచిస్తున్నాడు.

ఇప్పటివరకు అఖిల్ చేసిన సినిమాలు అతనికి ఏ రకంగాను హెల్ప్ కాలేదు. మరి ఇకమీదటైనా ఆయన జాగ్రత్తగా వ్యవహరిస్తూ కథల విషయంలో క్లారిటిని మెయింటైన్ చేస్తూ ముందుకు సాగితే బాగుంటుందని సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com