Telangana intellectual movements : తెలంగాణ చరిత్ర ఉద్యమం.. నిజాం విముక్తి పోరాటం.. ఉమ్మడి ఏపీలో కలవడం.. తిరిగి పోరాటంతో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు వరకూ తెలంగాణ గొప్ప యుద్ధమే చేసింది.
ఈ పోరాటంలో కమ్యూనిస్టుల పాత్ర ఎంతో ఉంది. ప్రజలతో మమేకమై.. పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం కమ్యూనిస్టులు నాడు నిజాం చేసిన పోరాటం అసమాన్యమైనది. ఆ ప్రభావం అనేక దశాబ్దాలు కొనసాగింది. అది సమాజానికి మేలు చేసింది.
ఆ తర్వాత 1980 లలో మావోయిస్టు ఉద్యమం పురుడుపోసుకుంది. ఇప్పటివరకూ పట్టి పీడించింది. యువత తమ జీవితాన్ని వృథా చేసుకొని మావోయిజం బాట పట్టారు. నాడు జమీందార్లు, పటేల్, పట్వారీలు, అగ్రవర్ణాల దోపిడీపై మావోయిస్టులు చేసిన యుద్ధం ఖచ్చితంగా పేదలకు మేలు చేసింది. తర్వాత విరసం రచయితల సంఘం.. రాడికల్ విద్యార్థి సంఘాలు, మేధో సంఘాలు తోడయ్యాయి. పరోక్షంగా మావోయిస్టు ఉద్యమాన్ని కొందరు నడిపించారు. కమ్యూనిస్టు ఉద్యమాన్ని కొంత మంది నీరుగార్చారు.

