Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Naman Dhir: 15 బంతుల్లో 42 పరుగులు.. టీమిండియాకు గట్టోడు దొరికాడు..

Naman Dhir: 15 బంతుల్లో 42 పరుగులు.. టీమిండియాకు గట్టోడు దొరికాడు..

Oktelugu.com 1 day ago

Naman Dhir:ఒక జట్టుకు ఓపెనర్లు ఎంత బలంగా ఉండాలో.. మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు కూడా అంతే బలంగా ఉండాలి. ఒకవేళ ఓపెనర్లు విఫలమైతే.. మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు సమర్ధవంతంగా ఆడుతారు.

అప్పుడు జట్టుకు ఓటమితప్పుతుంది. ఒకప్పుడు ఆస్ట్రేలియా ఇదే సిద్ధాంతాన్ని పాటించేది.. జస్టిన్ లాంగర్.. డామియన్ మార్టిన్.. మైకేల్ బేవన్.. లాంటి ప్లేయర్లు మిడిల్ ఆర్డర్లో శక్తివంతమైన పాత్రను పోషించేవారు. అందువల్లే ఆస్ట్రేలియా వరుస విజయాలు సాధించేది.

ఇక టీం ఇండియా విషయానికి వస్తే యువరాజ్ సింగ్.. సురేష్ రైనా.. లాంటి ప్లేయర్లు మిడిల్ ఆర్డర్లో సమర్థవంతమైన ఆట తీరు ప్రదర్శించేవారు. వారిద్దరు జట్టుకు దూరమైన తర్వాత.. ఆస్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లు ఇంతవరకు రాలేదు. అయితే ఇప్పుడు ఆస్థానాన్ని భర్తీ చేస్తున్నాడు నమన్ దీర్. భయం అనేది తెలియకుండా.. దూకుడు మాత్రమే తెలిసేలా.. ప్రత్యర్థి బౌలర్లు భయపడేలా అతడు బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇటీవల వెస్టిండీస్ సిరీస్ ద్వారా అతడు జట్టులోకి వచ్చాడు. వచ్చిన అవకాశాలను వినియోగించుకున్నాడు. ఇప్పుడు న్యూజిలాండ్ గడ్డమీద కూడా అదే స్థాయిలో ఆడుతున్నాడు.

న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి టీ20 లో టీమిండియా ఏకంగా నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. టీమిడియా గెలవడానికి ప్రధాన కారణం నమన్. న్యూజిలాండ్ భారీ లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ.. భారత్ కీలక సమయంలో వికెట్లు కోల్పోయినప్పటికీ.. చివరి ఓవర్లలో ఉత్కంఠ తారస్థాయికి చేరినప్పటికీ.. నమన్ తన బ్యాట్ ద్వారా సమాధానం చెప్పాడు. కేవలం 15 బంతుల్లోనే అజేయంగా 42 పరుగులు చేసి.. టీమ్ ఇండియాకు అద్భుతమైన విజయాన్ని అందించాడు.

న్యూజిలాండ్ విధించిన 226 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఒక దశలో తడబడింది. ఉపేందర్లు మెరుగ్గా ఆడినప్పటికీ.. కీలక దశలో వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఉత్కంఠ గా మారింది. ఇలాంటి సమయంలో క్రీజ్ లోకి వచ్చి నమన్ దూకుడు ప్రదర్శించాడు. న్యూజిలాండ్ బౌలర్ల మీద విరుచుకుపడ్డాడు. కేవలం 15 బంతుల్లోనే 42 పరుగులు చేసి.. టీమిండియా కు విజయాన్ని ఖాయం చేశాడు. 15 బంతుల్లో అతడు ఐదు ఫోర్లు.. రెండు సిక్సర్లు కొట్టాడు.

నమన్ ఇన్నింగ్స్ లో ముఖ్యంగా కనిపించింది అతని దూకుడుతో పాటు ఒత్తిడిని తట్టుకొనే సామర్థ్యం. ప్రతి బంతిని భారీగా కొట్టాలని ప్రయత్నించకుండా.. బంతి వేగానికి తగ్గట్టుగా బ్యాటింగ్ చేశాడు. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.. ఈ మ్యాచ్లో సంజు 33 బంతుల్లో 67 పరుగులు చేశాడు. అభిషేక్ 12 బంతుల్లో 29 పరుగులు చేశాడు. అయితే ఆ తర్వాత టీమిండియా వికెట్లు కోల్పోయింది. లక్ష్యానికి దగ్గరవుతున్న క్రమంలో ఉత్కంఠ పెరిగిపోయింది. అయ్యర్ 42 పరుగులు.. అక్షర్ 24 పరుగులు చేసి జట్టు విషయంలో కీలకపాత్ర పోషించారు. అక్షర్ ఔట్ అయిన తర్వాత నమన్ మీద ఒత్తిడి పెరిగింది. ఆయనప్పటికీ అతడు ఇబ్బంది పడలేదు. బౌండర్లతో స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. చివరి దశలో మ్యాచ్ ముగించే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్నాడు. తన ఫినిషింగ్ సామర్థ్యాన్ని చాటుకున్నాడు. చివరి దశలో నమన్ ఆడిన దూకుడు భారత జట్టు విజయానికి ఖాయమైంది. ఐపీఎల్ లో తన బ్యాటింగ్ ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ ప్లేయర్.. ఇంటర్నేషనల్ మ్యాచ్లో కూడా తన స్థాయిని చూపిస్తున్నాడు..

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com