Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నెక్స్ట్ టార్గెట్ ప్రకాష్ రాజ్!

నెక్స్ట్ టార్గెట్ ప్రకాష్ రాజ్!

Oktelugu.com 3 months ago

Prakash Raj: ఏపీలో నెక్స్ట్ టార్గెట్ నటుడు ప్రకాష్ రాజ్ అని తెలుస్తోంది. ఇప్పటికే జోసెఫ్ రావణ్ అరెస్టు జరిగింది. ఉగ్రవాద నిర్మూలనకు సంబంధించిన చట్టపరమైన కేసులు ఆయనపై నమోదయ్యాయి.

దీంతో తెర వెనుక చాలా తతంగం జరిగినట్లు అర్థం అవుతోంది. అంతర్జాతీయ కుట్రగా అనుమానిస్తున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా బిజెపి పై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు ప్రకాష్ రాజ్. జస్ట్ ఆస్కింగ్ అంటూ జాతీయ స్థాయిలో సైతం భారతీయ జనతా పార్టీతో ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇప్పుడు ఏపీలో జోసెఫ్ రావణ్ కేసులు అడ్డంగా బుక్కయ్యారు. ఆయన వెనుక ఉండి స్క్రిప్ట్ అందించింది ప్రకాష్ రాజ్ అని స్పష్టంగా తెలుస్తోంది ఆడియోలో. మరోవైపు కర్ణాటక ధర్మస్థల వివాదంలో సైతం ప్రకాష్ రాజ్ పేరు ప్రముఖంగా వినిపించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం సైతం ప్రకాష్ రాజు విషయంలో ఏపీ ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు తెలుస్తోంది.

* కఠిన చట్టం కింద కేసులు..
ఇప్పటికే జోసెఫ్ రావణ్ అరెస్టు జరిగింది. ఆయనపై దేశద్రోహం, ఉపా చట్టం కింద గన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు. రిమాండ్ రిపోర్టు ప్రకంపనలకు దారితీస్తోంది. ఈ కేసులో త్వరలోనే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ చుట్టూ తిరగబోతోందని ప్రచారం సాగుతోంది. జోసెఫ్ రావణ్ వెనుక ఉండి సహకారం అందిస్తున్న వారి విషయంలో పోలీసులు ప్రాథమికంగా ఒక దర్యాప్తు పూర్తి చేశారు. ఇందులో ప్రముఖంగా ప్రకాష్ రాజ్ పేరు వినిపించింది. ఆయనకు సంబంధించిన ఒక ఆడియో బయటకు వచ్చింది. జోసెఫ్ రావణ్ కు ఏం మాట్లాడాలో స్క్రిప్ట్ అందించింది ప్రకాష్ రాజ్ అని ఆరోపణలు వస్తున్నాయి. అందుకే తాజాగా ఈ కేసులో ప్రకాష్ రాజ్ కు నోటీసులు అందించేందుకు పోలీసులు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.

* కేంద్రానికి ఇదే అవకాశం..
ప్రకాష్ రాజ్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఇది అనుకోని అవకాశం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీని అంతలా టార్గెట్ చేశారు ప్రకాష్ రాజ్. జస్ట్ ఆస్కింగ్ పేరుతో జాతీయస్థాయిలో సైతం చాలా అంశాలను ప్రస్తావిస్తూ బిజెపి ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. వాస్తవానికి బిజెపితో పొత్తు పెట్టుకున్నారన్న భావనతోనే టార్గెట్ చేసుకున్నారు పవన్ కళ్యాణ్ ను ప్రకాష్ రాజ్. అంతకుముందు చిత్ర పరిశ్రమలో ప్రకాష్ రాజ్ కు అండగా నిలబడింది మెగా ఫ్యామిలీ. మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ప్రకాష్ రాజును నిలబెట్టింది. ఆ సమయంలో ప్రకాష్ రాజ్ పవన్ గురించి గొప్పగా చెప్పేవారు. అటువంటి ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకోవడం వెనుక బిజెపి కారణం. బిజెపి పై ఉన్న వ్యతిరేకతను పవన్ పై చూపించారు ప్రకాష్ రాజ్.

* జాతీయ స్థాయిలో కుట్ర..
ఏపీలో ప్రస్తుత పరిస్థితులు కు అనుగుణంగా.. జాతీయస్థాయిలో సైతం మతవివాదాన్ని తెరపైకి తెచ్చేందుకు ఒక కుట్ర జరుగుతోందన్న అనుమానం కేంద్రంలో ఉంది. దీనిపై స్పష్టమైన సమాచారం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే జోసఫ్ రావణ్ పై దేశద్రోహం కేసు నమోదయింది. అయితే దేశస్థాయిలో మత విధ్వంశాలకు సంబంధించి స్పష్టమైన సమాచారం ఉన్నందున.. జోసెఫ్ రావణు వెనుక ప్రకాష్ రాజ్ ఉన్నారన్న సమాచారంతోనే కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో ప్రకాష్ రాజ్ కు నోటీసులు ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com