Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేపాల్ ప్రధాని Gen Z నాయకుడు కాదు.. ఇండియా ద్వేషి..

నేపాల్ ప్రధాని Gen Z నాయకుడు కాదు.. ఇండియా ద్వేషి..

Oktelugu.com 1 week ago

Nepal PM Balen Shah: మార్పు కావాలి అన్నారు. మార్పు కోసం ఉద్యమించారు. రోడ్లమీదకి వచ్చారు. కొత్త నాయకత్వాన్ని కోరుకున్నారు. దానికి తగ్గట్టుగానే అక్కడ మార్పులు జరిగాయి.

యువత కోరుకున్నట్టుగానే నాయకత్వ మార్పు జరిగింది. చివరికి ఏం జరిగిందంటే..

మన పక్కనే ఉన్న నేపాల్ దేశంలో కొద్ది నెలల క్రితం ఉద్యమం జరిగింది గుర్తుంది కదా.. జనరేషన్ జెడ్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలు తారాస్థాయికి చేరాయి. వారు చేసిన ఆందోళనల వల్ల అక్కడి ప్రభుత్వం తలవంచింది.. అవినీతికి పాల్పడిన పాలకులు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ బాలెన్ షా అనే కొత్త నాయకుడు పరిపాలిస్తున్నాడు. జనరేషన్ జెడ్ తరానికి బాలెన్ షా వారసుడిగా ఉంటున్నాడు. అయితే అతడు భారత్ మీద నిత్యం విద్వేషాన్ని ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా భారత్ – నేపాల్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

నేపాల్ ప్రధానమంత్రి బాలెన్ షా తీసుకున్న నిర్ణయం వల్ల ఎన్నో సంవత్సరాలుగా రవాణా రంగం మీద ఆధారపడిన భారతీయ డ్రైవర్ల ఉపాధికి పూర్తిగా గండిపడే అవకాశం కల్పిస్తోంది. ఇతడు మరో జెలెన్ స్కీ మాదిరిగా వ్యవహరిస్తున్నాడు. ఫలితంగా భారతదేశంలో పనిచేస్తున్న నేపాల్ పౌరుల జీవితాలను దుర్భరం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. మనదేశంలో నేపాల్ దేశస్థులకు పన్నులు లేని స్వేచ్ఛ సరిహద్దు రాకపోకలు ఉన్నాయి. పైగా ఇక్కడ అక్కడి ప్రజలకు సౌకర్యాలు లభిస్తున్నాయి. చారిత్రాత్మకంగా రెండు దేశాల మధ్య సంబంధాలు కూడా బలంగా ఉన్నాయి. అయితే వాటిని చెడగొట్టేందుకు బాలెన్ షా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

మన దేశానికి చెందిన పర్యాటకరిక్షాలు జోగ్ మని, రాణి సరిహద్దు మార్గం మీదుగా నేపాల్ దేశంలోకి ప్రవేశించకుండా అక్కడి పాలకులు నిషేధించినట్టు తెలుస్తోంది. ఎన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో రాకపోకలు సాగించి.. దానిమీద ఆధారపడి జీవిస్తున్న అనేకమంది భారతీయ డ్రైవర్ల ఉపాధి దెబ్బతింటున్నది. దశాబ్దాలుగా సాగుతున్న పాత విధానానికి నేపాల్ పాలకులు సరికొత్త భాష్యం చెబుతున్న నేపథ్యంలో అక్కడ భారత డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు. భారత్, నేపాల్ దేశాల మధ్య ప్రతిరోజు పర్యాటకులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. వారిని చేరవేర్చుతూ మన దేశానికి సంబంధించిన చిన్న చిన్న రవాణా కార్మికులు.. ఇతర ఆపరేటర్లు ఉపాధి పొందుతూ ఉంటారు. అయితే నేపాల్ ప్రభుత్వం నిర్ణయం వల్ల వారంతా కూడా ఉపాధికి దూరమయ్యే ప్రమాదం కనిపిస్తుంది. అత్యంత రద్దీగా ఉన్న ఈ మార్గాన్ని మూసివేస్తున్న క్రమంలో తమ ఉపాధి మొత్తం కాలగర్భంలో కలిసిపోతుందని డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరొకవైపు మన దేశానికి సంబంధించిన వాహనాలపై నిరంతరం నిఘా పెట్టడానికి నేపాల్ ప్రభుత్వం ఆన్లైన్ కష్టం సిస్టమ్స్ డిజిటల్ వెహికల్ ట్రాకింగ్ విధానాన్ని అమలులోకి తీసుకొచ్చింది. సరిహద్దుల్లో నిత్యం జరిగే రాకపోకలు.. వాణిజ్య కార్యకలాపాలపై పూర్తిస్థాయిలో నియంత్రణ సాధించాలని నేపాల్ ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే నేపాల్ ప్రభుత్వం మీద అంతర్జాతీయంగా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా సరిహద్దుల విధానాలు.. వ్యూహాత్మకంగా, ఆర్థికంగా వేస్తున్న అడుగులపై అంతర్జాతీయంగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో భారతదేశానికి వ్యతిరేకంగా నేపాల్ వ్యవహరిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com