Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నెయిల్ పాలిష్ వేసుకునేవారికి WHO హెచ్చరిక..

నెయిల్ పాలిష్ వేసుకునేవారికి WHO హెచ్చరిక..

Oktelugu.com 22 hrs ago

WHO Warning On Nail Polish: అందంగా కనిపించేందుకు మహిళలు తరచూ నెయిల్ పాలిష్ వాడటం ఇప్పుడు సాధారణమైపోయింది. ఫ్యాషన్‌లో భాగంగా వివిధ రంగుల నెయిల్ పాలిష్‌లను ఉపయోగిస్తున్నప్పటికీ, వాటిలో ఉండే కొన్ని రసాయనాలు ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా రోజూ లేదా తరచూ నెయిల్ పాలిష్ వేసుకోవడం వల్ల దీర్ఘకాలంలో శరీరంపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం World Health Organization (WHO) హెచ్చరించింది. ఇంతకీ నెయిల్ పాలిష్ తో ఎలాంటి సమస్యలు ఉంటాయంటే?

నెయిల్ పాలిష్‌లలో ఫార్మాల్డిహైడ్ , టోలుయెన్ , డీబీపీ వంటి ప్రమాదకర కెమికల్స్ ఉంటాయి. వీటిని 'టాక్సిక్ ట్రియో' అని కూడా పిలుస్తారు. ఈ రసాయనాలు గోళ్ల అందాన్ని పెంచినా, శరీరానికి మెల్లగా హాని చేసే అవకాశముందని వైద్యులు వివరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ World Health Organization ఫార్మాల్డిహైడ్‌ను గ్రూప్-1 క్యాన్సర్ కారక పదార్థంగా వర్గీకరించింది. అంటే ఇది మనుషుల్లో క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశాలు ఉన్న రసాయనంగా గుర్తించబడింది. దీర్ఘకాలంగా ఈ కెమికల్‌కు గురైతే శ్వాసకోశ సమస్యలు, కళ్లలో మంట, చర్మ అలర్జీలు వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

టోలుయెన్ అనే కెమికల్ ఎక్కువగా వాసన రూపంలో శరీరంలోకి వెళ్తుంది. దీని వల్ల తలనొప్పి, తల తిరగడం, అలసట, వికారం వంటి సమస్యలు రావచ్చు. అలాగే ఎక్కువ కాలం దీని ప్రభావానికి లోనైతే నాడీ వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

డీబీపీ అనే రసాయనం గోళ్లపై పాలిష్ ఎక్కువకాలం నిలవడానికి ఉపయోగిస్తారు. అయితే ఇది హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీసే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా గర్భిణులు మరియు చిన్నపిల్లలు ఈ కెమికల్స్‌కు ఎక్కువగా గురికాకుండా జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే ప్రత్యేక సందర్భాలు, ఫంక్షన్లు లేదా వేడుకల కోసం అప్పుడప్పుడు నెయిల్ పాలిష్ వేసుకొని వెంటనే తొలగించుకుంటే పెద్ద ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు. కానీ నిరంతరం గోళ్లపై పాలిష్ ఉంచడం వల్ల గోళ్లు బలహీనపడటం, పసుపు రంగులోకి మారటం, పొడిబారటం వంటి సమస్యలు రావచ్చని హెచ్చరిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com