Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నీట్ పేపర్ లీకేజీ.. శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా రిపీట్

నీట్ పేపర్ లీకేజీ.. శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా రిపీట్

Oktelugu.com 1 week ago

Neet Paper Leak Case: శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా చూశారా.. ఇందులో చిరంజీవి ఒక రౌడీ. ఒక ఛాలెంజ్ నిమిత్తం డాక్టర్ అవ్వాలని అనుకుంటాడు. అనేక అడ్డదారులు తొక్కుతాడు.

చివరికి డాక్టర్ అవ్వలేక చేతులెత్తేస్తాడు. అదంటే సినిమా కాబట్టి సాగిపోతూ ఉంటుంది. కానీ దానిని రియల్ లైఫ్ లోకి అప్లై చేశాడు ఇతడు. ఏకంగా నీట్ పేపరు మొత్తాన్ని లీక్ చేశాడు. లక్షల పదిమంది విద్యార్థుల భవితవ్యాన్ని నాశనం చేశాడు.

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహారాష్ట్రలోని నాసిక్ వైద్యుడు డాక్టర్ శుభం ను సిబిఐ అధికారులు అరెస్ట్ చేశారు. విచారిస్తున్న క్రమంలో దారుణమైన నిజాలు బయటపడుతున్నాయి. శుభం వైద్యుడిగా కొనసాగుతున్నాడు. కానీ ఒక్కరోజు కూడా మెడికల్ కాలేజీకి వెళ్లలేదు. ఇతడి స్వస్థలం నందగావ్. ఇతడు నాసిక్ ప్రాంతంలో కోచింగ్ కారిడార్ ప్రాంతంలో ఎస్సార్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. దాని నేమ్ బోర్డు లో శుభం పేరు ముందు డాక్టర్ అని రాసి ఉంటుంది. స్థానికంగా అతడు తనను తాను డాక్టర్గా పరిచయం చేసుకున్నాడు. అంతేకాదు ఎంబిబిఎస్, బిడిఎస్, బిహెచ్ఎంఎస్ వంటి మెడికల్ కోర్సులలో అడ్మిషన్ల కోసం ప్రయత్నాల సాగించే విద్యార్థులకు అతడు సలహాలు ఇస్తుంటాడు. 2021లో భోపాల్ సమీపంలోని సత్యసాయి యూనివర్సిటీలో బ్యాచ్లర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ కోర్సు ఇతడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అయితే పోలీసులు విచారణలో ఆ యూనివర్సిటీ వీసీని సంప్రదించారు. అప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం అడ్మిషన్ సమయంలోనే శుభం యూనివర్సిటీ కి వెళ్ళాడు. ఆ తర్వాత తరగతులకు హాజరు కాలేదు.

నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారం ముందుగా రాజస్థాన్లో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత విచారణ జరుగుతున్న కొద్ది అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేపర్ ను శుభం పదిలక్షలకు కొనుగోలు చేశాడు. కొరియర్ లో ప్రశ్నపత్రం వస్తే.. దానిని పిడిఎఫ్ లాగా మార్చాడు. ఆ తర్వాత దానిని గురుగ్రామ్ ప్రాంతంలో ఒక వ్యక్తికి 15 లక్షలకు అమ్మాడు. ఈ పేపర్ మొత్తం అనేక రాష్ట్రాలను చుట్టింది. పలువురు విద్యార్థులు రెండు నుంచి ఐదు లక్షల వరకు వెచ్చించి కొనుగోలు చేశారు. అయితే క్వశ్చన్ పేపర్ లీకేజీ బయటపడడంతో.. శుభం పరారీ లో ఉన్నాడు. తర్వాత తనను ఎవరు గుర్తుపట్టకుండా ఉండడానికి గుండు చేయించుకున్నాడు. అయితే పోలీసులు డిజిటల్ ఆధారాలు సేకరించి అతడిని అరెస్ట్ చేశారు. శుభం సోదరుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com