Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
NTR Health Update: జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి పై సంచలన అప్డేట్.. ఇది అసలు ఊహించలేదు..

NTR Health Update: జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితి పై సంచలన అప్డేట్.. ఇది అసలు ఊహించలేదు..

Oktelugu.com 1 week ago

NTR Health Update: జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గానే 'డ్రాగన్' మూవీ షూటింగ్ సమయంలో తీవ్రమైన గాయాల పాలైన సంగతి అందరికీ తెలిసిందే. రెండు భుజాలకు తీవ్రమైన గాయాలు అవ్వడంతో ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.

వైద్యుల సమక్షం లో ఆయనకు మెరుగైన చికిత్స జరుగుతోంది. ముందుకు 6 నుండి 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు , ఎన్టీఆర్ వేగంగా కోలుకుంటుండడం తో మరో రెండు వారాలు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని అంటున్నారట డాక్టర్లు. ఇది అభిమానులకు పండుగ లాంటి వార్త అనే చెప్పాలి. ఎన్టీఆర్ అభిమానులు ఊహించిన దానికంటే వేగంగా కోలుకోవడంతో వాళ్ళ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. మరోపక్క ఎన్టీఆర్ లేకపోయినప్పటికీ కూడా ‘డ్రాగన్’ మూవీ షూటింగ్ కి బ్రేక్ పడలేదు. నాన్ స్టాప్ గా చేస్తూనే ఉన్నారట. ప్రస్తుతానికి ఎన్టీఆర్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.

ఎన్టీఆర్ సెట్స్ లోకి అడుగుపెట్టేలోపు ఆయన లేని సన్నివేశాల షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చెయ్యాలనే లక్ష్యంతో ముందుకు దూసుకెళ్తుందట మూవీ టీం. సమయాన్ని వృధా చేయకుండా , విడుదల తేదీ టార్గెట్ అవ్వకూడదనే ఇలా చేస్తున్నారని సమాచారం. ఇకపోతే డ్రాగన్ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 11 న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఇప్పటికే అధికారిక ప్రకటన చేశారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన గ్లింప్స్ వీడియో కి ఫ్యాన్స్ , ఆడియన్స్ నుండి బ్లాస్టింగ్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ లుక్స్ పై సోషల్ మీడియా లో ట్రోల్స్ జరిగినప్పటికీ , గ్లింప్స్ వీడియో లో మంచి కంటెంట్ ఉండడం తో , కచ్చితంగా ఈ చిత్రం 1000 కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందని అంటున్నారు ఫ్యాన్స్. ఈ చిత్రం కేవలం ఒక్క భాగంగా కాదు , రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం జూన్ 11 న విడుదల అవుతుండగా , రెండవ భాగం డిసెంబర్ లో విడుదల కానుంది.

ఈ చిత్రం లో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. ముందుగా విలన్ క్యారెక్టర్ కోసం మలయాళం హీరో తొనివో థామస్ ని ఎంచుకున్నారు. అయితే మొదట్లో చేసిన షూటింగ్ ఔట్పుట్ కి ప్రశాంత్ నీల్ సంతృప్తి చెందలేదు. దీంతో ఔట్పుట్ మొత్తాన్ని తొలగించాల్సి వచ్చింది. మరోసారి తొనివో డేట్స్ సర్దుబాటు కాకపోవడం తో విలన్ క్యారెక్టర్ కూడా ఇప్పుడు ఎన్టీఆర్ నే చేస్తున్నాడు. మొన్న విడుదల చేసిన గ్లింప్స్ వీడియో విలన్ క్యారెక్టర్ కి సంబంధించినది. ఇలా హీరో గా విలన్ గా ఎన్టీఆర్ ఈ చిత్రం ద్విపాత్రాభినయం చేస్తూ మరోసారి తన నట విశ్వరూపం చూపించబోతున్నాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Oktelugu.com